ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత ఖ్యాతి సంపాదించారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు భారత చలన చిత్ర పరిశ్రమలో దేశం గర్వించదగ్గ గాయకులలో  ఒకరు ఎస్పీ బాలసుబ్రమణ్యం. బాలు ఏ పాట పాడిన సంగీత ప్రేమికులకు వినసొంపుగా ఉంటుంది. అది మాస్  పాట అయిన క్లాస్ పాట అయిన. మెలోడీ  పాటైన... సంగీత నేపథ్యమున్న పాటైనా.. ఆ పాటకు ఎస్పీ బాలు గానం  తోడయింది అంటే ఆ పాట మరో రేంజ్లో  ఉంటుంది. అక్షరాలకు ప్రాణం పోసేది ఆయన గానం . ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఖ్యాతి  సంపాదించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇక ఆయన ఏదైనా పాట పాడారు అంటే పాటకు సంగీత ప్రముఖులు ఫిదా అవ్వాల్సిందే . తన గొంతుతో పాటకే  సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. 

 


 ఇప్పుడు వరకు వందల సినిమాల్లో వేల పాటలు పాడారు. ప్రతి పాటలోనూ కొత్తదనం... ఏ పాట లో  అయినా మైమరిపించే చేసే గానం... ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలు ఎన్నో హొయలు  ఉంటాయి. ఎలాంటి పాట నైనా ఇట్టే పాడేస్తూ  సంగీత ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అందుకే ఆయనను భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అని అంటారు. గాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం... కేవలం సింగర్  గానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన టాలెంట్ నిరూపించుకున్నారు . ఓవైపు సింగర్గా అదరగొడుతునే  మరోవైపు తనదైన నటనతో  సినీ ప్రేక్షకులను మెప్పించారు. 

 


 ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి... ఎంతో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు ఆయన. గానంతో పాటకు ప్రాణం పోయడమే కాదు నటనతో పాత్రకు ప్రాణం పోయగల బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు . ఇక ఆయన ప్రధాన పాత్రలో నటించిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. బాలసుబ్రమణ్యం ప్రధాన పాత్రలో నటించిన మిధునం సినిమాలో ఎస్పి బాలసుబ్రమణ్యం... పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరుకు సినీ ప్రేక్షకులను ఫిదా అయ్యారు అని చెప్పాలి. ఈ సినిమాలో తన లోని గొప్ప నటుడిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అంతే కాకుండా ఎంతో మంది హీరోలకి  గాత్రదానం చేశారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: