భారత చలనచిత్రరంగంలో... గానగంధర్వుడి గా... ఒక గొప్ప గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఇలాంటి గొప్ప గాయకుడు మన తెలుగువాడు అని చెప్పుకోవడానికి తెలుగు ప్రజలకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. నేపథ్య గాయకుడిగా ఆయన ప్రస్థానం మహాద్భుతం. ఏ గాయకుడికి సాధ్యం కాని రీతిలో పేరుప్రఖ్యాతులు సాధించిన గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఏకంగా 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది మహోన్నత తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

 


 ఏ గాయకుడికి సాధ్యం కాని రీతిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గాయకుడు బాలు . ఎన్నో  జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. అయితే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏకంగా నాలుగు భాషల్లో జాతీయ అవార్డును అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం మాత్రమే. జాతీయ అవార్డులే  కాదు ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు సైతం ఎస్పీ బాలసుబ్రమణ్యం సొంతం. ఇక భారత చలన చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులను కూడా ఇచ్చి గౌరవంగా ఆయనను సత్కరించింది.

 

 

 అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఏదైనా పాట పాడారు అంటే ఇక సంగీత ప్రేక్షకులందరూ ఆ పాట వింటూ మైమర్చిపోతూ ఉంటారు. అక్షరాలకు ప్రాణం పోసే గానంతో  ఎస్పీ బాలసుబ్రమణ్యం... ఎలాంటి పాట పాడిన అది మహా అద్భుతం గా ఉంటుంది. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం గానానికి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఆయన గాత్రంలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అందుకే ఎస్పీ బాలసుబ్రమణ్యం పాట వింటున్నంత సేపు... మనసుకు ఎంతో హాయి కలుగుతూ ఉంటుంది. అందుకే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గానానికి  ఫిదా అవని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: