జాతీయ స్థాయి ఉత్తమ నటుడు దర్శకుడు ప్రకాష్ రాజ్ కు మొన్న బుధవారం హైదరాబాద్ ‘ఆగడు’ సెట్ లో తీవ్ర అవమానం జరిగినట్లుగా ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక వార్తను ప్రచురించింది. ఆ పత్రిక తెలియ చేస్తున్న సమాచారం ప్రకారం ‘ఆగడు’ సినిమాలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్న ప్రకాష్ రాజ్ బుధవారం ఆ సినిమా షూటింగ్ కు హాజర్ అయిన దగ్గర నుంచి చాల అసహనంగా కోపంగా ఉండటమే కాకుండా ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్స్ పై ప్రతి చిన్న విషయానికి విరుచుకు పడడం మొదలు పెట్టాడట. ప్రకాష్ రాజ్ వింత ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయిన శ్రీను వైట్ల సద్ది చెపుదామని ప్రయత్నించినా ప్రకాష్ రాజ్ తన సహజ సిద్దమైన మోనార్క్ గా వ్యవహరించాడట. ఇలా ప్రవర్తించడం గతంలో కూడా కొన్ని విషయలలో జరిగిన సందర్భాలు ఉండటంతో యూనిట్ సభ్యులంతా సద్దుకు పోదామని ప్రయత్నించినా ఆరోజు షూటింగ్ మధ్య నుంచి వెళ్ళిపోవడమే కాకుండా మరునాడు షూటింగ్ కు రానని కోపంతో తెగేసి చెప్పాడట ప్రకాష్ రాజ్. నిన్న జరగ వలసిన షూటింగ్ కు రావాలని దర్శకుడు శ్రీను వైట్ల నిర్మాతలు బ్రతిమాలుతారు అని అనుకున్న ప్రకాష్ రాజ్ కు అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చేస్తున పాత్రలో నటించడానికి బాలీవుడ్ విలన్ సోను సూద్ ను నిముషాల మీద సంప్రదించి నిన్న ఉదయానికల్లా ‘ఆగడు’ సినిమా సెట్లో సోను ఉండేటట్లుగా చేసి ప్రకాష్ రాజ్ నటించవలసిన సన్నీవేసాల షూటింగ్ ను నిన్నటి నుంచి సోనూ సూద్ పై చిత్రీకరించడం ప్రారంభించారట. అనోకొని ఈ షాక్ కు ప్రకాష్ రాజ్ ఖంగ్ తిన్నాడు అంటు ఆ పత్రిక వార్తను ప్రచురించింది. ఇంత తతంగం జరుగుతున్నా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తామరాకు పై నీటి బొట్టులా ఉన్నాడు అంటు ఆ పత్రిక కామెంట్ చేసింది. ‘ఆగడు’ టీమ్ ప్రకాష్ రాజ్ కు గాటి షాక్ ఇచ్చిందనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: