నందమూరి వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తండ్రి హరికృష్ణ వారసులుగా ఈ ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో వారికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ తన టాలెంట్ తో టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే ఎన్టీఆర్ నందమూరి వంశంలో ఎక్కువ క్లోజ్‌గా, ఆప్యాయంగా కళ్యాణ్ రామ్ తోనే ఉంటాడన్న విష‌యం అందరికి తెలిసిందే. 

IHG

అంతేకాదు, ఎన్టీఆర్ తన కెరీర్‌లో తొలిసారి తమ కుటుంబానికి చెందిన అన్న కళ్యాణ్ రామ్ ఓన్ బ్యానర్‌ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ‘జై లవకుశ’ సినిమా చేసాడు. ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ కేవలం నిర్మాతగా నష్టపోయిన అన్న కళ్యాణ్ రామ్‌ను ఒడ్డున పడేయడానికే చేసినట్టు అప్పట్లో టాక్ కూడా న‌డిచింది. ఇక ఈ సినిమా సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అలాగే‌ క‌ళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్‌కు ఎంతో బాగా స‌పోర్ట్ చేస్తూ.. అండ‌గా ఉంటారు. మ‌రియు వీళ్లిద్దరి ఒకరి సినిమాల విషయంలో మరోకొరు ఎంతో కేరింగ్‌గా వ్యవహరిస్తూ వుంటారు. 

IHG

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఎన్టీఆర్‌ను క‌ళ్యాణ్ రామ్ త‌మ్ముడు అని మాత్రం ఎప్పుడూ పిల‌వ‌ర‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా క‌ళ్యాణ్‌ రామ్‌మే చెప్పారు. తారక్ తనతో కొన్నిసార్లు తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడని.. మరికొన్నిసార్లు చిన్నపిల్లాడు అయిపోతాడని.. అతడితో అన్ని ఎమోషన్స్ కలిసిపోయి ఉంటాయని చెప్పారు. అందుకే తారక్ ని ఎప్పుడూ తమ్ముడూ అని పిలవానని.. వేదికలపై సైతం నాన్నా అనే పిలుస్తానని చెప్పుకొచ్చాడు క‌ళ్యాణ్ రామ్‌. ఇక తన తండ్రి అంటే తనకు చాలా ఇష్ట‌మ‌ని.. ఆయ‌న‌లేని లోటు తారక్ తీరుస్తున్నాడని ఎమోష‌న్ అయ్యాడు క‌ళ్యాణ్ రామ్‌.

 
 
    

మరింత సమాచారం తెలుసుకోండి: