మన తెలుగు లో కొన్ని కొన్ని సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే జనాలకు మాత్రం ఒక రేంజ్ లో నచ్చాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది సినిమాలను హాల్ లో చూడకపోయినా సరే టీవీ లో వస్తే మాత్రం మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. సినిమా కోసం చాలా మంది ప్రాణం పెట్టి చూస్తూ ఉంటారు ఫ్లాప్ అయినా సరే. చాలా సినిమాలు అదే విధంగా టీవీ లో హిట్ అయ్యాయి అనే చెప్పాలి. అందులో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా చెన్న కేశవ రెడ్డి. ఈ సినిమాలో బాలయ్య కోసం జనాలు చూస్తారు. 

 

ఆయన నటన చాలా మందికి ఇప్పుడు బాగా నచ్చింది. అప్పుడు చాలా మంది ఆ సినిమా మీద కామెంట్స్ చేసినా సరే ఇప్పుడు ఈ సినిమా టీవీ లో వచ్చింది అంటే చాలా బాగా చూస్తూ ఉంటారు. ప్రధానంగా కొన్ని కొన్ని సీన్స్ లో బాలయ్య నటన కోసమే సినిమా చూసే వారు ఉన్నారు అనేది వాస్తవం. ప్రధానంగా కొన్ని సీన్స్ లో బాలయ్య జీవించారు అనే చెప్పాలి. కథలో ఆయన కాకుండా మరో హీరో అయి ఉంటే సినిమా దాదాపుగా ఫ్లాప్ అయ్యేది అని అంటారు. కొన్నికొన్ని సీన్స్ కోసం ఆయన చాలా బాగా నటించి మెప్పించారు. 

 

ఇక అది అలా ఉంటే ఈ సినిమా సంగీతం బాగా హిట్ అయింది. యాక్షన్ సన్నివేశాల కోసం బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా అందించారు ఆయన. ఈ సినిమాలో సంగీతమే హైలెట్ అయింది అని చాలా మంది అన్నారు అంటే  ఏ రేంజ్ లో సంగీతం హిట్ అయింది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా బాలయ్యకు మంచి పేరు తీసుకొచ్చింది. మణిశర్మ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: