టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఒకరు ప్రస్తుతం తన కొడుకు కెరీర్ విషయమై కొంత డైలమాలో ఉన్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కొన్నేళ్ల క్రితం తన కెరీర్ మొదట్లో మంచి సక్సెస్ లు అందుకుని, ఆపై తన టాలెంట్ తో పలు అవకాశాలు అందుకుని, వాటిని విజయాలుగా మలుచుకున్న సదరు హీరో గారు, ఆ తరువాత తన నటవారసులుగా తెరంగేట్రం చేసిన ఇద్దరు కొడుకుల కెరీర్ గురించి ఎంతో ఆలోచన చేసారని, అయితే అనుకున్న విధంగా ఆయన మొదటి కుమారుడు మంచి సక్సెస్ లతో ప్రస్తుతం ముందుకు సాగుతుండగా, రెండవ కుమారుడు మాత్రం సరైన సక్సెస్ కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి పై మాత్రం ఆయన లోలోపల కొంత మధనపడుతున్నట్లు సమాచారం.
ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, ఫస్ట్ సినిమాతోనే చిన్న కుమారుడిని ఎంతో గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేసిన సదరు హీరో గారు, ఆ సినిమా ఘోరంగా దెబ్బతినడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారని, అయితే ఆ తరువాత వచ్చిన రెండవ సినిమాపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకోగా, అది కేవలం యావరేజ్ గా నిలవడం, ఆపై వచ్చిన మూడవ సినిమా కూడా అదే విధంగా పర్వాలేదనిపించడంతో, అసలు తన చిన్న కొడుక్కి సరైన హిట్ ఎప్పుడు వస్తుందో అని ఆవేదన చెందుతున్నారట.
ఇక ఇటీవల అతడి నాలుగవ సినిమాని గ్రాండ్ గా మొదలెట్టి సగం పూర్తి చేయగా, మధ్యలో కరోనా కారణంగా మూడు నెలల నుండి పూర్తి షూటింగ్స్ బంద్ కావడం, మళ్ళీ తిరిగి అవి ఎప్పుడు పునః ప్రారంభమవుతాయో క్లారిటీ లేకపోవడం, ఒకవేళ ప్రారంభమై, షూటింగ్ మొత్తం ముగించుకుని ఆఖరుకి రిలీజ్ అయితే, ఈ పరిస్థితుల్లో ఆ సినిమాలను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది కూడా కొంత సందేహాస్పదంగా మారడంతో, ఆయన మరింత ఆవేదన చెందుతున్నారట. కాగా సదరు హీరో గారు ఆశిస్తున్నట్లు, ఆయన రెండవ కుమారుడు ఎప్పుడు హిట్ కొడతాడో తెలియాలి అంటే బహుశా దానికి కాలమే సమాధానం చెప్పాలేమో అని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి