టాలీవుడ్ నటి ,పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే విషయాల పైన జంతువుల పై జరిగే అన్యాయాల పైన స్పందిస్తూ ఉంటుంది. గడిచిన కొన్ని రోజుల క్రితం కుక్కల సంరక్షణ కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి జనాల మీద ఫైర్ అయ్యింది రేణు దేశాయ్. దీంతో ఈమె పైన సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ వాటికి సంబంధించి విమర్శల పైన సోషల్ మీడియాలో కౌంటర్ వేస్తూనే ఉంది. తనమీద బూతులు తిట్టిన వారిని లైవ్ పెట్టి మరి అలాంటి వారిని అరెస్ట్ చేయిస్తానంటూ కూడా హెచ్చరించింది.


దీంతో కొంతమంది ఆమె పర్సనల్ లైఫ్ పైన కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. అలా రేణు దేశాయ్ పైన బూతుల కామెంట్స్ చేసిన వారిని ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశారు. ఇప్పుడు వాటికి సంబంధించి రేణు దేశాయ్ మరో వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ .. లాస్ట్ టైం లైవ్ కి వచ్చినప్పుడు చెప్పాను తనని బూతులు తిడితే మాత్రం అరెస్ట్ చేయిస్తానని ఇప్పటికే ఆరు మందికి పైగా అరెస్టు చేయించాను. ఇందులో ఇద్దరిని వదిలేశారు. మిగిలిన వారిని రిలీజ్ ఆపేశారు. ఎందుకు ఇలా బూతులు పెడుతున్నారు ఆవిడ గురించి పర్సనల్గా మీకు ఏమైనా తెలుసా అని అడిగితే.. కేవలం వాళ్ళు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఫేమ్ తెచ్చుకోవడం కోసమే ఇలాంటివి చేస్తున్నామని చెప్పారని అందుకే ఇకమీదట అరెస్టు చేసే వాళ్ళ ఐడెంటిటీ పబ్లికి రివిల్ చేయకూడదంటూ ఫిక్స్ అయ్యానని కానీ అరెస్టులు మాత్రం ఆగవని తెలియజేసింది.


మీరు బూతులు పెట్టాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ల పైన కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. సొసైటీ ముందు మీరు అరెస్టు అవుతారు. మీ కెరియర్ లైఫ్ బ్లాక్ మార్క్ గా పడిపోతుంది. బూతులు పెట్టడం మంచిది కాదు మీరు ఏదైనా ఆఫీసులో పని చేస్తే ఆ ఆఫీసులో మీ పై వాళ్లకు కూడా మీరు ఇలా చేస్తున్నట్టు కూడా చెప్తాము.. నా పైన కాదు ఎవరి పైన మీరు ఇలాంటి బూతులు కామెంట్స్ చేస్తే అరెస్ట్ అవుతారు. మీకు మా సెలెబ్రేటీల వర్క్ నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా బూతులతో కామెంట్స్ చేస్తే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందంటు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: