కరోనా పరిస్థితుల వల్ల టాప్ హీరోల సినిమాలకు కూడ గతంలో లా భారీ బిజినెస్ జరిగే అవకాశాలు లేవు అన్నఅంచనాలు వస్తున్న పరిస్థితులలో భారీ నిర్మాణ సంస్థలు కూడ తాము ప్రస్తుతం టాప్ హీరోలతో తీస్తున్న భారీ సినిమాల బడ్జెట్ కు అనేక కోతలు విధిస్తున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా టాప్ హీరోలకు దర్శకులకు ఇచ్చే భారీ పారితోషిక విషయంలో కూడ సుమారు 25 శాతం కోత విధించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి.
అయితే ఈ ప్రయత్నాలకు ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు దర్శకులు స్పందించకుండా మౌనం కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కొరటాల శివ ‘ఆచార్య’ మూవీ విషయంలో తన పారితోషికం స్వచ్ఛందంగా తగ్గించుకున్నట్టు టాక్. కొణిదెల ప్రొడక్షన్స్ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవీ విషయంలో కొరటాల పారితోషికం ముందుగానే నిర్ణయింప బడింది.
అయితే ఈమూవీ నిర్మాతల నుండి ఇంకా రాయబారాలు రాకుండానే కొరటాల తనకు తానుగా తన పారితోషికాన్ని తగ్గించుకావడంతో ఈమూవీలో నటిస్తున్న చిరంజీవి మరొక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ లు కూడ తమ పారితోషికాలను తగ్గించు కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఈ మూవీకి సంబంధించి తనకు రావలసిన భారీ పారితోషిక విషయంలో ఇప్పటి వరకు మౌనం వహిస్తున్న చిరంజీవి కొరటాల చర్యతో తాను కూడ స్పందించవలసిన అవసరం ఏర్పడింది అని అంటున్నారు.
ఈమూవీ బడ్జెట్ ఖర్చులు తగ్గించమని ఇప్పటికే ఒకటికి పదిసార్లు చిరంజీవి కొరటాలకు చెపుతూ ఉండటంతో ఈ షాకింగ్ నిర్ణయం కొరటాల తీసుకుని ఉంటాడు అని అంటున్నారు. అయితే రామ్ చరణ్ ఈ మూవీలో తన పక్కన హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేయమని పట్టుపడుతున్నట్లు వార్తలు వస్తున్న పరిస్థితులలో ఇలా కొరటాల చిరంజీవి చరణ్ లు తమ పారితోషికాలు తగ్గించుకుని ఆ మొత్తాలను జాన్వీకి సద్దుబాటు చేస్తారేమో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి