దేశంలో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదు అయ్యే పరిస్థితి త్వరలో రాబోతోందని సెప్టెంబర్ నెలాఖరుకు దేశంలో కరోనా కేసులు కోటి సంఖ్యకు దగ్గర అవుతాయి అన్నఅంచనాలను అమెరికాకు చెందిన ‘ప్రిన్స్ టన్’ యూనివర్సిటీ అంచనాలు ఇచ్చింది అన్నవార్తలు కలవరం కలిగిస్తున్నాయి. దీనితో ఈసంవత్సరానికి సంబంధించిన ఆశలు అన్నింటిని టాలీవుడ్ ఇండస్ట్రీ వదులుకుంది.


ఇలాంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగష్టులో తిరిగి తెరవడానికి అనుమతించాలని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కేంద్రహోమ్ మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది అన్నవార్తలు వస్తున్నాయి. ఐ అండ్ బి కార్యదర్శి అమిత్ ఖరే సిఐఐ మీడియా కమిటీతో జరిపిన సంభాషణలో ఈవిషయాన్ని ప్రస్తావించారు.


అయితే ఈవిషయమై తుది నిర్ణయం తీసుకోవలసింది కేంద్ర హోమ్  మంత్రిత్వ శాఖ అన్నవిషయం తెలిసిందే. ఆగస్టు 1 లేదా 31 తేదీ మధ్యలో ఎప్పుడైనా దేశం అంతటా థియేటర్లు తెరవడానికి అనుమతించాలని తాను సిఫార్సు చేశానని ఖరేచెపుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడ తయారు అయ్యాయని వాటిప్రకారం సీటుకి సీటుకి మధ్య గ్యాప్ తరువాత వచ్చే వరుసను ఖాళీగా ఉంచడం లాంటి విధానాన్ని అనుసరించడంతో పాటు ఇంకా అనేక సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.


ఇప్పుడు ఈవార్త ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టి వరకు రావడంతో దీనివల్ల థియేటర్ యజమానులకు అదేవిధంగా సినిమా నిర్మాతలకు ఏమాత్రం కలిసివచ్చే విషయాలు లేవని విశ్లేషిస్తున్నారు. ఈవిధంగా ధియేటర్లు నడపాలి అంటే ధియేటర్లు అన్నీ 25శాతం జనాలతో మాత్రమే నడుస్తాయని ఇలా థియేటర్లను ఓపెన్ చేసేకంటే ధియేటర్లను ఈసంవత్సరం చివరివరకు క్లోజ్ చేయడం మంచిది అంటూ ఒక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా సోనీ మాడిసన్ డిస్కవరీ అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లాంటి ప్రముఖ ఓటీటీ స్ట్రీమ్స్ లో విడుదల అయ్యే వెబ్ సిరీస్ లపై కూడ సెన్సారింగ్ పెట్టాలని ప్రభుత్వం కొత్త ఆలోచనలలో ఉన్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: