బిటౌన్ బడా హీరో సల్మాన్ ఖాన్ నలభై అంతస్థుల భవనం దూకి అందరిని షాక్ కు గురిచేశాడు.అయితే ఇదంతా టాలీవుడ్ ఫిల్మ్ కిక్ మూవీ రిమేక్ షూటింగ్ లో జరిగింది. ఈ మూవీ కోసం సల్మాన్ ఖాన్ రియల్ స్టంట్ చేశాడని అందరూ అనుకుంటున్నారు కాని, దీని వెనక ఉన్న అసలు మేటర్ ఏంటో బిటౌన్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే బయటకు చెబుతుంది. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం మేరకు ఈ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సల్మాన్ ఖాన్ చేసిన భంగీ జంప్ చాలా డేంజరస్ అని సీనియర్ స్టంట్ మాస్టర్స్ సైతం చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఎవ్వరికి అర్ధం కావడం లేదని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం. 40 అంతస్థులు నుండి దూకటానికి డూప్ రెడీగా ఉండగానే, తనను కాదని హీరోనే స్వయంగా నిర్ణయం తీసుకొని ఈ విధమైన డేంజరస్ స్టంట్ చేశాడు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కి ఎవ్వరు ఎంతగా చెప్పినా వినిపించుకోలేదంట. తను కచ్ఛితంగా ఆ స్టంట్ ను చేయాల్సిందే అంటూ సరైన ట్రైనింగ్ లేకుండానే షాట్ కు రెడీ అయ్యాడు. టైం బాగుండి సల్మాన్ ఖాన్ సేఫ్ గా కిందకు దూకాడు. లేకంటే ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు అని స్టంట్ మాస్టర్స్ చెప్పారు. సల్మాన్ మనస్సు ఆ సమయంలో సరిగా లేదని బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో తెలియని కోణాలు ఈ విధమైన చర్యకు ప్రేరేపించి ఉంటాయని బిటౌన్ లోని టాప్ టెలివిజన్ ఛానల్ కథనాన్ని టెలికాస్ట్ చేసింది. ఆ షాట్ పూర్తయ్యాక కాసేపటి వరకూ సల్మాన్ ఖాన్ ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాడని చిత్రయూనిట్ నుండి అందిన సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: