మొదటగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సాంబ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది జెనీలియా. ఫస్ట్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుని, హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన జెనీలియా, ఆ తరువాత సై, నా అల్లుడు, హ్యాపీ, సుభాష్ చంద్ర బోస్, రామ్ సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువాత వచ్చిన బొమ్మరిల్లు సినిమా సంచలన విజయాన్ని అందుకుని జెనీలియాకు హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెటింది. ఇక దాని అనంతరం తెలుగుతో పాటు హిందీలో కూడా పలు అవకాశాలు అందుకున్న జెనీలియా, ఇటీవల బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుంది.  

అయితే వివాహం తరువాత సినిమాలు తగ్గించేసిన జెనీలియా, ఇటీవల హిందీలో తెరెకక్కిన లై భారీ, ఫోర్స్ 2, మౌళి సినిమాల్లో క్యామియో అప్పీయరెన్సు ఇచ్చింది. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం అతి త్వరలో బన్నీ హీరోగా దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కనున్న ఐకాన్ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ కి హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు. గతంలో బన్నీతో కలిసి హ్యాపీ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్న జెనీలియా, ఈ సినిమా కథ తనకు ఎంతో నచ్చడంతో వెంటనే ఓకే చేసిందని అంటున్నారు.  

మంచి కమర్షియల్ హంగులతో, పలు ఎంటర్టైనింగ్ అంశాలతో దర్శకుడు వేణు శ్రీరామ్సినిమా కథను సిద్ధం చేసాడని, అలానే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, ఎప్పటినుండో తమ హీరోయిన్ తెలుగులో నటిస్తే చూడాలని భావిస్తున్న జెనీలియా ఫ్యాన్స్ కు మాత్రం ఇది మంచి పండుగ వార్తే అని అంటున్నారు విశ్లేషకులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: