ఇళయదళపతి విజయ్ రేంజ్ కు తగినట్టుగా క్రేజీ మూవీగా మాస్టర్ వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీ చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ బైలింగ్వల్ సినిమా ఉందని చెప్పాడు లోకేష్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రాం చరణ్ లోకేష్ కనగరాజ్ సినిమాలో హీరోగా చేస్తాడని అంటున్నారు.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ తో.. అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ తో అల్లు అర్జున్. మహేష్ పరశురాం తో సర్కారు వారి పాట సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ ఎలాగు తన సినిమాలతో బిజీగా ఉండగా వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ కూడా వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇక ఎటొచ్చి రాం చరణ్ మాత్రమే తన నెక్స్ట్ సినిమా ఏంటన్నది డిసైడ్ కాలేదు. తెలుగు, తమిళ భాషల్లో లోకేష్ కనగరాజ్ చేసే సినిమా హీరో చరణ్ అని అంటున్నారు. అఫీషియల్ ఎనౌన్మెంట్ వస్తే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం గ్యారెంటీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి