హీరోలెప్పుడూ మార్కెట్ పెంచుకోవాలని, ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. భారీ రెమ్యునరేషన్ అందుకొని టాప్ లీగ్ లో అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ మాత్రం నిర్మాతలకు సాయంగా పేమెంట్ తగ్గించుకుంటున్నాడు. అవసరమైతే మూవీ బడ్జెట్ కూడా కంట్రోల్ చేద్దామని ప్రపోజల్ పెడుతున్నాడట. మరి ఇళయదళపతిలో ఈ మార్పుకి కారణమేంటని ఆయన అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

కరోనాతో ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. నిర్మాతలపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. మున్ముందు సినిమా నిర్మాణం చాలా భారంగా మారుతుంది కాబట్టి హీరోలు రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలని నిర్మాతల సంఘాలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే తెలుగు హీరోల సంగతి ఎలా ఉన్నా, తమిళ స్టార్ విజయ్ మాత్రం తన పేమెంట్ లో 30 శాతం తగ్గించుకున్నాడు. ఆల్ రెడీ సైన్ చేసిన సినిమాకు కూడా 30 తగ్గించుకుని మిగతా హీరోలకు ఇన్ స్పిపిరేషన్ గా నిలుస్తున్నాడు.

ఛారిటీలో విజయ్ చాలా ముందుంటాడు. కరోనా క్రైసిస్ తో ఇండస్ట్రీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాక సినీ కార్మికుల కోసం 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దక్షిణాది రాష్ట్రాల సీయం రిలీఫ్ ఫండ్స్ కి, పీయం కేర్స్ కి కలిపి మొత్తంగా  కోటీ 30 లక్షలు విరాళం ఇచ్చాడు ఇళయదళపతి. ఇక డొనేషన్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న విజయ్ ఇప్పుడు నిర్మాతలపై భారం తగ్గించడంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నాడు. మురుగదాస్ తో చేయబోయే సినిమా రెమ్యునరేషన్ లో 30 కోట్లు తగ్గించుకున్నాడట విజయ్.

విజయ్ జనరల్ గా 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అయితే సన్ పిక్చర్స్ బ్యానర్ లో మురుగదాస్ సినిమాకి డీల్ పూర్తయ్యాక కరోనా లాక్ డౌన్ వచ్చింది. అయితే నిర్మాణ సంస్థలన్నీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి కాబట్టి, ప్రొడ్యూసర్స్ పై భారం తగ్గించడానికి తన రెమ్యునరేషన్ లో 30 పర్సంట్ తగ్గించుకున్నాడట విజయ్. ఈ మూవీకి 70 కోట్లే ఛార్జ్ చేస్తున్నాడని చెబుతున్నారు. మరి కోలీవుడ్ టాప్ హీరో తీసుకున్న ఈ రూట్ లో ఇంకెంతమంది స్టార్స్ ప్రయాణిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: