మొన్నటి వరకు ఫ్యామిలీ హీరోగా ఉన్న జగపతిబాబును ‘లెజెండ్’ సినిమా రాత్రికిరాత్రి జగ్గుభాయ్ గా మార్చేసింది. లక్షలలో ఉన్న ఆయన పారితోషికాన్ని ‘లెజెండ్’ కోటి పై కూర్చో పెట్టింది. ప్రస్తుతం అరడజను సినిమాలతో సినిమాకు కోటి తీసుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు జగపతి. అయితే జగపతి బాబు నిర్మాతలను ఫూల్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ కామెంట్ వినిపిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే జగపతిబాబు హీరోగా ఏప్రిల్ ఫూల్ అనే సినిమా రిలీజ్ కు సిద్దమై చాలాకాలం గడిచినా జగపతి బాబు సినిమాలకు మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదాలు పడతు వచ్చింది. అయితే ‘లెజెండ్’ సినిమా సూపర్ హిట్ కావడంతో బయ్యర్లు ధైర్యం చేసి ఈ సినిమాను కొనడానికి ముందుకు వచ్చారు. దీనితో ఈ సినిమాను ఈనెల 10న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే హీరో జగపతిబాబు మాత్రం వారికి అందుబాటులోకి రావడంలేదట. ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రెస్ మీట్లలో జగపతిబాబు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. సినిమా రిలీజ్ కు కేవలం వారం రోజులే సమయముండగా ఇప్పటికీ ప్రచారంలో జగపతి లేకపోవడం చూసిన ఇండస్ట్రీ జనాలు జగపతికి ఒకేఒక్క సినిమా హిట్ తో అప్పుడే నిర్మాతలకు చుక్కలు చూపెట్టే స్థాయికి ఎదిగి పోయాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: