ప్రభాస్ ఏవిషయం గురించి ముందు సీరియస్ గా తీసుకోడు అన్నప్రచారం ఉంది. దీనికితోడు ఇతడు ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మారిపోయే కలెక్షన్ రికార్డుల పై తనకు నమ్మకంలేదు అంటూ కామెంట్స్ కూడ చేసాడు. అయితే ఇప్పుడు అలాంటి ప్రభాస్ పూర్తిగా మారిపోయాడా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


‘బాహుబలి’ మూవీ కోసం సంవత్సరాల తరబడి ప్రభాస్ బందీగా మారిపోవడంతో ఆతరువాత తన సినిమాల విషయంలో తన ఆలోచనలు పూర్తిగా మార్చుకున్నాడు. ‘సాహో’ మూవీ చేస్తున్న సమయంలోనే ‘రాథే శ్యామ్’ సినిమాను మొదలుపెట్టి ఈరెండు సినిమాలను ఒకటితో ఒకటి క్లాష్ లేకుండా సమాంతరంగా పూర్తిచేయాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు.  


ఈరెండు మూవీల షూటింగ్ ల విషయంలో వచ్చిన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ప్రభాస్ పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నాడు అన్న లీకులు వస్తున్నాయి. నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలవడానికి రెండేళ్ల సమయం పడుతుంది. ‘ఆది పురుష్’ చిత్రానికి కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ పని ఎక్కువ. ఈరెండు సినిమాలకు ప్రభాస్ ఇచ్చే డేట్స్ కంటే గ్రాఫిక్స్ పరంగా ఎక్కువ సమయం పడుతుంది.


ఈవిషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ఇప్పుడు తన వ్యూహం మార్చి వచ్చే ఏడాది సమాంతరంగా రెండు పాన్ ఇండియా మూవీలను పూర్తి చేయడానికి డిజైన్ చేసుకున్న యాక్షన్ ప్లాన్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రభాస్ ‘ఆది పురుష్‌’ కి ఒక నెల రోజుల పాటు షూటింగ్ చేసి ఆతరువాత  నాగ్ అశ్విన్ చిత్రానికి రెండు నెలల వర్క్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకున్నట్లు టాక్. ఇలా ఈరెండు సినిమాల మధ్య తన డేట్స్ విషయంలో  సమన్వయం చేస్తూ ఈరెండు సినిమాల షూటింగ్ వేగంగా పూర్తి కావడానికి ప్రయత్నిస్తాడట. ప్రస్తుతం టాప్ హీరోలు అందరు ఒక సినిమా పూర్తి అయితే కాని మరొక సినిమా చేయలేని పరిస్థితులలో ప్రభాస్ అనుసరిస్తున్న ఈకొత్త వ్యూహం తాము ఎంతవరకు అనుసరించగలం అన్న వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: