బిగ్‌బాస్ సీజన్ 4 రోజు రోజు చాలా ఆసక్తికరంగా మారుతోంది. మంచి టాస్కులతో, కామెడీతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మొదట ఇంటి సభ్యులు చాలా కొత్తగా అనిపించినా  రోజులు అయ్యే కొద్దీ ఇంటి సభ్యులు బాగా అర్ధం అవుతున్నారు ప్రేక్షకులకి. సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎవరు బాగా ఎఫర్ట్ పెడుతున్నారు అన్నవి యిట్టె అర్ధం అయిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ హౌస్ నుంచి సూర్య కిరణ్ టు కుమార్ సాయి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ సోమవారం నామినేషన్ ప్రక్రియ మళ్ళీ మొదలైంది.

నిన్న జరిగిన టాస్క్ లో  ఇంటిలోని సభ్యుల్ని ఇద్దరిద్దరుగా సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలని బిగ్‌బాస్ చెప్పడం జరిగింది. మోనాల్, అఖిల్ ఇదారిని ఏకాభిప్రాయానికి రమ్మంటే... నేను  స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ ని కాబట్టి నేను సేవ్ అవుతానని అఖిల్ అనడంతో మోనాల్ నామినేట్ అయింది. అలానే కొంచెం చర్చ తర్వాత  అవినాష్  నామినేట్ అయ్యాడు.

ఇది ఇలా ఉండగా అభిజిత్ - హారికల మధ్య కాసేపు చర్చ సాగింది. హారిక మనం ఇద్దరం సమానంగా ఉన్నాం. ఎవరు నామినేషన్ లోకి వెళ్లాలన్న కష్టమే అని అంది. ఒక దశలో హారిక అభిజిత్‌ని షటప్ అంటూ అరిచి తనని నామినేట్ చేయడం ఇష్టం లేదని హారిక చెప్పింది. ఆ తరువాత  బిగ్‌బాస్ ఇన్ అన్‌ఫేర్ అని ఏడ్చేసింది. కానీ  అభిజిత్ మాత్రం హారిక కోసం త్యాగం  చేసి నామినేట్ కావడం బాగా ఆకట్టుకుంది. ఇది అయిపోయాక దివి కూడా నామినేట్ చేసుకుంది. ఇక ఆఖరి జంట  అరియానా - మెహబూబ్‌ల. వీరి మధ్య మాత్రం ఒక గట్టి చర్చ సాగింది. ఫైనల్‌గా అరియానా నామినేట్ చేసుకుంది. ఆటలో తను నామినేట్ అయినా రియల్‌గా గెలిచింది ఈ అమ్మాయి. ఇలా ఈ వారం నామినేషన్ లో వీళ్ళు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: