ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.... ‘ప్రేమిస్తే’ సినిమా ప్రేక్షకులకి ఇప్పటికీ ఎందుకు గుర్తుంది? అందులో ఎమోషన్, అంతకు ముందు చూపించిన ప్రేమకథ అంత సహజంగా ఉంటుంది మరి! ‘ప్రేమిస్తే’ అనే కాదు… చాలా ప్రేమకథల్లో పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి మధ్య ఏర్పడిన సహజమైన బంధమే ఉంటుంది. ఎమోషన్ కనెక్ట్ అయితే క్లాసిక్ అని అనిపించుకుంటాయి. లేదంటే మంచి ప్రయత్నంగా మిగులుతాయి. పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి కథకు వర్ణవివక్షను జోడించిన ‘కలర్ ఫొటో’ చూశాక ఏమనిపిస్తుంది? ఇది క్లాసిక్ సినిమానా? లేదంటే మంచి ప్రయత్నమా?


కథ విషయానికి వస్తే.... జయకృష్ణ (సుహాస్), దీప్తి ఇందుకూరి (చాందిని చౌదరి)ది మచిలీపట్నంలో ఓకే కాలేజీ. దీప్తి అందంగా, తెల్లగా ఉంటుంది. పైగా, పెద్దింటి అమ్మాయి. దీప్తి అన్నయ్య రామరాజు (సునీల్) ఎస్సై. జయకృష్ణ నల్లగా ఉంటాడు. ఉదయం నాలుగు ఇళ్లకు పాలు పోసి కాలేజీకి చదుకోవడానికి వస్తాడు. మంచి స్టూడెంట్. దీప్తితో ప్రేమలో పడతాడు. జయకృష్ణని ఆమె కూడా ప్రేమిస్తుంది. ఈ విషయం రామరాజుకి తెలుస్తుంది. చెల్లెల్ని విజయవాడ పంపిస్తాడు. ఇక్కడ మచిలీపట్నంలో జయకృష్ణను భయపెడతాడు. చెల్లెలికి అమెరికా సంబంధం చూస్తాడు. రామరాజు బెదిరింపులకు భయపడిన జయకృష్ణ, దీప్తి విడిపోతారా? ఎదురించి పెళ్లి చేసుకున్నారా? చివరికి ఏమైంది? అనేది కథ.

నటీనటుల పనితీరు చూస్తే....  సుహాస్, చాందిని చౌదరి, సునీల్, హర్ష… కథలో ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురూ తమ నటనతో ఆకట్టుకున్నారు. అందరి కంటే హర్ష, చాందినికి ఎక్కువ మార్కులు వేయవచ్చు. హర్ష సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశాడు. సైలెంట్ గా పంచ్ డైలాగ్స్ వేసి నవ్వించడంతో పాటు అవసరమైనప్పుడు సెంటిమెంట్ సీన్లు బాగా చేశాడు. చాందిని చౌదరి 1990ల కాలంలో నాటి అమ్మాయిలా కనిపించింది. చక్కగా నటించింది. సునీల్ చేయడం వలన పాత్రకు వెయిట్ పెరిగింది.సుహాస్ కి యాక్టింగ్ కంటే వాయిస్ ప్లస్ అని చెప్పుకోవాలి. ఎమోషనల్ సీన్లలో అతడి డైలాగ్ డెలివరీ బాగుంది. రెండు మూడు సన్నివేశాల్లో నవ్వించాడు. కానీ, ఎక్కువగా యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సుహాస్ తండ్రి పాత్రలో తన పరిధి మేరకు ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ సుబ్బారావు నటించారు. మిగతా నటీనటులు పర్వాలేదు. నటన పరంగా సినిమాకి వంక పెట్టడానికి లేదు.

విశ్లేషణ.....కలర్ డిస్క్రిమినేషన్ బ్యాక్ డ్రాప్ లో చెప్పిన బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి కథే ‘కలర్ ఫోటో’. దీనికి పెర్ఫార్మన్స్ లు, డైలాగ్స్, సాంగ్స్ యాడ్ అవ్వడంతో మంచి ప్రయత్నంగా మిగిలింది. ప్రేమ కథను ముందు నుండి మరింత స్ట్రాంగ్ గా చూపించి ఉంటే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది. అయినా ఎమోషన్ కొన్ని సీన్లలో వర్కవుట్ అయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: