నందమూరి సింహం బాలకృష్ణ ఏమి చేసినా సంచలనమే. తాను చేసే ప్రయత్నాలు వల్ల తన పై చాలమంది సెటైర్లు వేసినా బాలయ్య పట్టించుకోడు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో శివశంకరి పాటను పాడి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ పాటను విన్న చాలమంది బాలయ్య ప్రయోగాలతో ఆ పాట ఖ్యాతి నాశనం అవుతోంది అంటూ కామెంట్స్ చేసినా అప్పట్లో బాలయ్య పట్టించుకోలేదు.  


ఇప్పుడు మళ్ళీ ఈ నందమూరి సింహం ఏనాడో పక్కన పెట్టిన నర్తనశాల ప్రాజెక్ట్ లోని ఫుటేజ్ ను బయటకు తీసి శ్రేయాస్ ఏటిటి లో విడుదల చేస్తున్నాడు. దీనికి రెగ్యులర్ సినిమా విడుదలకు  చేసినంత హంగామా చేస్తున్నాడు.  ఇది చాలదు అన్నట్లుగా దసరా పండుగ రోజున బాలయ్య నుంచి మరో రెండు షాకింగ్ లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  


తెలుస్తున్న సమాచారం మేరకు బాలయ్య పాడిన ఇంగ్లీష్ పాట దసరా పండుగ రోజున విడుదల అవుతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ ఇంగ్లీష్ పాటను కోరస్ తో కలిపి బాలయ్య పాడాడని ఇప్పటికే  దీనికి సంబంధించిన  రికార్డింగ్ కూడ పూర్తి చేసినట్లు టాక్. శివశంకరి ఎంత హడావుడి చేసిందొ దానికి మించిన హడావిడి  ఈ ఇంగ్లీష్ పాటలో ఉంటుందని అంటున్నారు.

ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ‘నర్తనశాల’ విడియో ఫుటేజ్ లో చివర్న బాలయ్య సౌందర్య గతంలో నటించిన ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘టాప్ హీరో’ మూవీలోని సాంగ్ బిట్ ను యాడ్ చేసారని తెలుస్తోంది. ఆ సినిమాలో టోపీ పెట్టుకుని బాలయ్య సౌందర్య తో చిందులు వేసిన  ‘ముద్దుపాప..ఓ ముద్దుపాప’ పాట బిట్ యాడ్ చేసారని తెలుస్తోంది. దీనితో దసరా పండుగ రోజున బాలయ్య ఇంగ్లీష్ ప్రావీణ్యత బాలయ్య రొమాన్స్ బాలయ్య పౌరాణిక భాష పటుత్వం ఇలా నవరసాలతో అందరికి పండుగ భోజన్నాన్ని పెట్టడానికి ఈ నందమూరి సింహం పూర్తిగా రెడీ అయినట్లు సంకేతాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: