పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్ల క్రితం అజ్ఞాతవాసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా పవన్ భారీ పరాజయాన్ని అందుకోవడం జరిగింది. దాని తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్ ఇటీవల వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది.

ఇకపోతే దీనితోపాటు క్రిష్ దర్శకత్వంలో మరొక భారీ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్ దాని అనంతరం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఒక సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించనున్న మరొక సినిమా అలానే యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్న సినిమాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నారు. ఈ విధంగా వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటి ద్వారా విజయాలు అందుకుని కెరీర్ పరంగా మంచి పేరు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పవన్ ఫ్యాన్స్ మాత్రం మొదటి నుంచి ఆయన నుండి ఆశిస్తున్నది మాత్రం ఒకటి ఉంది. మిగతా హీరోలు అందరూ కూడా సిక్స్ ప్యాక్ లు చేస్తూ కొనసాగుతుంటే ఒక్క పవన్ మాత్రమే ఆ ప్రయత్నం చేయడం లేదని వారు కొంత నిరాసక్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే కొందరు పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుంచి అందిన సమాచారాన్ని బట్టి ప్రస్తుతం రెండు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా దృష్టి పెట్టి కొనసాగుతున్న పవన్ ఇప్పుడు ఎంచుకున్న స్క్రిప్ట్ లని బట్టి ఆయా పాత్రలకు తగ్గట్టుగా తన బాడీ ని కొంత మార్చుకుంటూ ముందుకు కొనసాగుతున్నారని అయితే ఇప్పటి వరకు కూడా ఆయన సిక్స్ ప్యాక్ చేసే అంతటి స్థాయి ఉన్న స్క్రిప్ట్ ఏది కూడా రాలేదని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అటువంటి స్క్రిప్ట్ గనక తన వద్దకు వస్తే తప్పకుండా ఆ పాత్ర రీత్యా పవర్ స్టార్ సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్ అందరినీ ఖుషి చేస్తారని వారు అంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి పవన్ కి అది పెద్ద కష్టసాధ్యమైన విషయం కాదనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం తమ్ముడు సినిమాలో తన బాడీని ప్రదర్శించి గొప్ప సాహసాలు చేసి మంచి పేరు దక్కించుకున్నారు పవన్. సో రాబోయే రోజుల్లో ఆయనకు మంచి పాత్రను తగిలితే తప్పకుండా ఆయన సిక్స్ ప్యాక్ చేస్తారు అనే విషయాన్ని ఫ్యాన్స్ అందరు గుర్తు పెట్టుకొని అప్పటి వరకు సంయమనం పాటించాలని అంటున్నారు విశ్లేషకులు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: