బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించినా తమకు ఒరిగింది ఏమి లేదని చాల మంది హీరోయిన్స్ బాధ పడుతున్నారు. బాలయ్యతో ‘సింహా’ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన స్నేహ ఉల్లల్, నమిత లకు ఈ సినిమా ద్వార పేరొచ్చినా ఆ తరువాత టాలీవుడ్ లో ఏ మాత్రం అవకాశాలు రాలేదు.
ఇప్పుడు అదే పరిస్థితి బాలయ్యతో మరో సూపర్ హిట్ సినిమా ‘లెజెండ్’ లో నటించిన సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టేలకు వచ్చింది అంటూ వీరిదరి పై సెటైర్లు పడుతున్నాయి. ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా ‘లెజెండ్’ నిలిచినా ఆ పేరంతా బాలయ్య ఖాతాలోకి వెళ్లి పోయింది కాని హీరోయిన్స్ కు సరైన అవకాశాలు కూడ రాకుండా పోయింది.
బాలకృష్ణ సినిమాలలో నటించిన హీరోయిన్స్ కు పెద్ద పేరు రాదు అని చెప్పడానికి మరొక ఉదాహరణగా ‘లెజెండ్’ హీరోయిన్స్ ను ఉదాహరిస్తున్నారు. అందుకే కాబోలు బాలయ్య సినిమాలంటే టాప్ హీరోయిన్స్ అందరూ పారిపోతారు.
ఈ పరిస్థితి ఇలా ఉండగా ఇక లాభం లేదనుకుని ఈ సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్ ఇక లాభం లేదనుకుని తన అందాలను ఆరబోస్తూ ట్రాన్స్పరెంట్ దుస్తులు ధరించి ఫోటో షూట్లు, ఫేషన్ ప్యారేడ్లలో సెక్సీగా కనిపిస్తూ ఆ విధంగానైనా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఏది ఏమైనా బాలయ్య హీరోయిన్స్ కు సినిమాలు హిట్ కొట్టినా కాలం కలిసి రావడంలేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: