వడ్డే నవీన్ ప్రేమ పెళ్లి..విడాకులు
ఇక్కడ వరకు బాగానే ఉన్న, హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యే క్రమంలో తన క్రేజ్ ని నిలబెట్టుకోలేక పోయాడు. సినిమా ఆకాశాలు తగ్గడంతో సహాయక పాత్రల్లో సైతం నటించాడు. అక్కడ నుండి నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోయాడు. మీడియా కు చాలా దూరంగా ఉంటూ వచ్చిన వడ్డే నవీన్ తన ఫ్యామిలీ ని బయట పెద్దగా కనిపించనివ్వలేదు. వడ్డే రమేష్ కి నందమూరి కుటుంబానికి ముందు నుండి మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది. ఆ చనువుతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ క్రమంలో ఎన్టీఆర్ మొదటి కుమారుడు అయినా రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని ప్రేమించి ఇంట్లో పెద్దల అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్నాళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.
కుటుంబ కలహాల ప్రభావం వడ్డే నవీన్ కెరీర్ పై తీవ్రంగా చూపించింది. పెద్ద ఫ్యామిలీ కి చెందిన కూతురితో విడాకులు అంటే ఆశ మాషి వ్యవహారం కాదు కదా. ఇక అక్కడ మొదలయిన పతనం ఇప్పటికి కొనసాగుతుంది. కానీ బయట చాలా మందికి వడ్డే నవీన్ ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయమే తెలియదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి