అయితే ఈ వారం ఈ ఐదుగురిలో హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారు అనే దానిపై అందరిలో ఎంతో ఉత్కంఠ నెలకొని ఉందనే చెప్పాలి. వాస్తవానికి ఈ వారం మొత్తం జరిగిన ఐదు రోజుల వోటింగ్ లో భాగంగా ఒక రెండు రోజులు వోటింగ్ పోల్స్ సరిగా పనిచేయలేదని, వాటికీ కొంత టెక్నీకల్ సమస్యలు వచ్చాయని వార్తలు రావడం జరిగింది. అయితే అప్పటివరకు మోనాల్ అందరికంటే ఒకింత వెనుకబడి ఉందని, అలానే మిగతా నలుగురూ కూడా మంచి వోటింగ్స్ తో దూసుకెళ్లారని సమాచారం.అయితే చివర్లో ఆ ఓట్లతో పాటు మిస్డ్ కాల్ వోటింగ్స్ ని పరిగణలోకి తీసుకుని కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ని డిసైడ్ చేసిందట బిగ్ బాస్ యూనిట్. అయితే ఆ సమయంలో వోటింగ్స్ కౌంటింగ్ లో అందరికంటే అవినాష్ కి చాలా తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. అలానే మోనాల్ సహా అభిజీత్, అఖిల్, హారిక లకు భారీ వోటింగ్ రావడంతో ఈ వారం అవినాష్ హౌస్ నుండి బయటకు వెళ్ళవలసిందే అని తెలుస్తోంది. వాస్తవానికి నిన్న ఉదయం నుండి ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవుతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారం నిజంగానే అవినాష్ ఈ వారం బయటకు వెళ్తాడా ఈ వార్త కరెక్టేనా అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి