అంతేకాకుండా రావణాసుని యొక్క మంచి పనులను... అతని మానవత్వాన్ని వ్యక్తపరిచే కొన్ని సంఘటనలను ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నామంటూ పేర్కొన్నాడు. రావణాసురుడులో కూడా సద్గుణాలు ఉన్నాయంటూ.... ఆ కోణాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నారు అన్నాడు. దాంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది. రావణుడిని రాక్షసుడిలా భావించే హిందువులు సైఫ్ అలీ ఖాన్ మాటలకు ఏకీభవించలేక పోగా... హిందువుల పురాణాల్లో రాక్షసుడిగా పిలవబడుతున్న రావణుణ్ణి సైఫ్ అలీ ఖాన్ పొగడడంతో... మన పురాణాలను ఎంతగానో నమ్మి, గౌరవించే హిందువులు ఈ విషయాన్ని సహించలేకపోతున్నారు. వీరితో పాటు బిజెపి పార్టీ నాయకులు సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి స్పందించిన బీజేపీ నాయకుడు రామ్‌కదం.. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలు తనను షాక్‌కు గురి చేశాయంటూ సొసైల్ మీడియాలో పేర్కొన్నారు. అంతేకాదు రాక్షసుడు లాంటి రావణాసురుడిని మంచివాడుగా చూపిస్తే అస్సలు సహించేది లేదని హెచ్చరించాడు.
ఇలా బిజెపి కార్యకర్తలు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. దీనికి స్పందించిన సైఫ్ అలీ ఖాన్, ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అది తన ఉద్దేశం కాదని తెలియజేశారు. ఒక వేళ తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడి ఉంటే తనని క్షమించమని, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు. హిందువుల ఇష్టదైవం రాముడు అంటే నాకు కూడా చాలా ప్రీతి మరియు గౌరవం అని ఆయన అన్నారు . నా దృష్టిలో రాముడంటే ధర్మానికి మరియు వీరత్వానికి అద్దం వంటివారు అని పేర్కొన్నారు సైఫ్ అలీ ఖాన్. అటువంటి రాముని గురించి తాను తక్కువ చేసి మాట్లాడబోనని చెప్పారు. కథ ఎక్కడా వక్రీకరించకుండా చెడుపై మంచి సాధించిన రాముని విజయాన్ని... ఆయన ఆదర్శాలను ‘ఆదిపురుష్’ చిత్రంలో చూపించనున్నారు’ సైఫ్ అలీఖాన్ తెలిపారు. ఈ విధంగా సైఫ్ అలీ ఖాన్ తాను వ్యాఖ్యానించిన అంశాల గురించి వివరణ ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి