టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన రామ్ చరణ్ గత ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ అందుకున్నారు. దీంతో తన తదుపరి సినిమా ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని డైరెక్టర్ బుచ్చిబాబుతో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.


సినిమా విడుదలకు ముందే నాన్ థియేట్రికల్  రైట్స్ తోనే ఒక సంచలనం సృష్టిస్తోంది పెద్ది సినిమా. బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ బ్రాండ్ వ్యాల్యూ మరొకసారి గ్లోబల్ స్థాయిలో నిరూపించిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓటిటి రైట్స్ పరంగా ఈ సినిమా ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్ రూ. 110 కోట్ల రూపాయలకు పైగా డీల్ క్లోజ్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా చూసుకుంటే.. నార్త్ రేంజ్ లో మార్కెట్ పరంగా రామ్ చరణ్ క్రేజ్ పెరగడంతో ఈ డీల్ కుదిరిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


దీంతో పెద్ది సినిమాకి ఒకరకంగా చెప్పాలంటే కేవలం ఓటీటి రైట్స్ ద్వారానే నిర్మాతలకు చాలా వరకు బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. టెలివిజన్ ,షాటిలైట్స్ ,ఆడియో హక్కులు కూడా పెద్ది సినిమా తన మార్క్ చాటుకునే అవకాశం ఉన్నది. పెద్ది సినిమా అన్ని భాషలలో శాటిలైట్ రైట్స్ కలుపుకొని సుమారుగా రూ .50 కోట్లు, తెలుగు శాటిలైట్ హక్కులు మాత్రం రూ  35 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా. మరొకపక్క మ్యూజిక్ రైట్స్ కోసం టి సిరీస్ రూ .35 కోట్ల కు తీసుకొనే అవకాశం ఉన్నదట. ఇలా మొత్తం ఓటిటి,శాటిలైట్, ఆడియో ,ఓవర్సీస్ రూపంలో పెద్ది సినిమాకి నాన్ థియేటర్ బిజినెస్ సుమారుగా రూ .250 కోట్ల వరకు ఈజీగా దాటినట్లు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: