ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకోవడంతో హౌస్ లో మిగిలిన మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ యొక్క అభిమానులు వారివారి ఫేవరెట్ హౌస్ మేట్స్ కి భారీ స్థాయిలో ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 14వ వారం హౌస్ నుంచి మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయి వెళ్ళిపోగా హౌస్ లో ఉన్న ఐదుగురిలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా నిలిచిన అభిజిత్, అరియానా, అఖిల్, సోహైల్, హారిక ల్లో ఎవరికి వారు తమ ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో కొనసాగుతున్నారు. ఇక మొదటి నుంచి హౌస్ లో మంచి మైండ్ గేమ్ ఆడుతూ తనదైన స్టైల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులు అలానే అభిమానుల్లో మంచి పేరు దక్కించుకుంటూ కొనసాగుతున్నాడు అభిజీత్.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా నటుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆపై అక్కడక్కడా కొన్ని సినిమాలతోపాటు పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మరింత క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ తర్వాత అభిజీత్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతోపాటు రోజు రోజుకి అతనికి విపరీతంగా ఓట్లు కూడా పెరగసాగాయి. నిజానికి ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం 14 వారాల ఎలిమినేషన్ లో భాగంగా మొత్తం 11 వారాలు అభిజిత్ ఎలిమినేషన్ జూన్లో ఉన్నప్పటికీ కూడా ఏ వారానికి ఆ వారం విపరీతమైన ఓట్స్ దక్కించుకొని సేవ్ అవుతూ వస్తున్నాడు. అయితే అభిజీత్ ఫిజికల్ టాస్క్ ల్లో మాత్రం సరిగ్గా పెర్ఫార్మ్ చేయడు అనేటువంటి మాత్రం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. నిజానికి ఆ విమర్శని బ్రేక్ చేస్తూ ఆ తరువాత కొన్ని టాస్క్ ల్లో బాగా పెర్ఫార్మ్ చేసి నిరూపించుకున్నాడు అభిజీత్.

మరోవైపు అతడు ప్రతి విషయంలోనూ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూసుకున్నట్లయితే రానురాను అభిజీత్ కి ఓటింగ్ స్థాయి విపరీతంగా పెరుగుతోందని ఇక ఈ తాజా సీజన్ చివరకు చేరుకోవడంతో ఈ వారం అతనికి మరింత భారీ స్థాయిలో ఓట్లు పోల్ అవుతున్నాయని అంటున్నారు. ఇక అతడి తర్వాత మిగతా స్థానాల్లో ఉన్న వారికి అతడి రేంజ్ లో అయితే ఓట్లు రానప్పటికీ వారికి కూడా బాగానే ఓటింగ్ అయితే నమోదు అవుతున్నట్లు టాక్. మొత్తం గా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సీజన్ విన్నర్ గా అభిజీత్ నిలవటం పక్కా అని ఇక అతడికి పోటీ ఇచ్చేవారు హౌస్ లో మరెవరూ లేరని, ఆ విధంగా అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ని అలానే అభాండాలు వేసి అభిజిత్ గెలుపుని ఎవరూ ఆపలేరని పలువురు ఆయన అభిమానులు అలానే ప్రేక్షకులు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: