సినిమా ఆరంభంలోనే కథలోకి వెళ్లిపోవడమే ఈ సినిమాకు పెద్ద ప్లస్. సినిమాలో ఎమోషనల్ సీన్లు హైలెట్ అయ్యాయి. ఇక ఇంటర్వెల్ సీన్లో సముద్రఖనికి రవితేజ ఎదురెళ్లినపుడు చలనం వస్తుంది.ఇంటర్వెల్‌కు ముందు వచ్చిన ఫైట్ తర్వాత ఫైట్ సీన్లతో మాస్ ప్రేక్షకులు ఊగిపోతారు. ఇంటర్వెల్ సీన్‌తో పాటు ఆ తర్వాత టెంపుల్ ఫైట్, బస్టాండ్ ఫైట్ ఇవన్నీ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టడంతో పాటు సినిమా గ్రాఫ్‌ను అమాంతం పెంచేశాయి.
వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రవితేజ కెరీర్‌కు కొత్తగా ఊపిరిలూదిన సినిమాగా క్రాక్ నిలుస్తుంది. రవితేజ ఈ వయస్సులో కూడా కుర్ర పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడం ఆకట్టుకుంది. ఇక దర్శకుడు గోపీచంద్ పాత రొటీన్ రివేంజ్ డ్రామాను ఎంత ఆసక్తికరంగా తెరకెక్కించాలో అంత ఆసక్తికరంగా ప్రజెంట్ చేశాడు. ఇక టెక్నికల్‌గా ఈ సినిమాకు వంక పెట్టడానికి వీల్లేకుండా ఉంది. సినిమాలో గ్రఫీ చంపేసింది.
యాక్షన్ సీన్లు మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసేలా డిజైన్ చేసినట్టుంది. ఓవరాల్‌గా క్రాక్ మాస్ మసాలా ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మంచి బిర్యానీ. చాలా రోజుల తర్వాత రవితేజకు సరైన టైంలో సరైన హిట్ పడడంతో పాటు ఈ సంక్రాంతికి కొత్త హుషారు కూడా ఇచ్చింది. ఇక మిగిలిన సినిమాల పోటీని తట్టుకుని క్రాక్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం ఎలా ? కురిపిస్తుందో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి