త్రివిక్రం మాత్రం ఈ సినిమాలో సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ మీద దృష్టి పెట్టాడని తెలుస్తుంది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఆమె ఒకరు. ఆ క్రేజ్ తోనే ప్రభాస్ తో సాహో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ తో కూడా రొమాన్స్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. సాహో సినిమాలో మెప్పించిన శ్రద్ధా కపూర్ ను తెలుగు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూడాలని అనుకుంటున్నారు. శ్రద్ధా కపూర్ అయితే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని ఆమెతో చర్చలు జరుపుతున్నారట.
తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి చేసిన వెంటనే త్రివిక్రం సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. అల వైకుంఠపురములో హిట్ జోష్ తో ఉన్న త్రివిక్రం ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు ఎన్.టి.ఆర్ సత్తా మారుమోగిపోతుంది.. ఆ హిట్ మేనియా కొనసాగించేలా త్రివిక్రం సినిమా ఉంటుందని టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి