ఇక అర్చన కుటుంబ విషయానికి వస్తే,అమ్మ గవర్నమెంట్ ఉద్యోగిని, నాన్న కన్నడ యాక్టర్. అర్చన తండ్రిగారు సీరియల్స్ తోపాటు కొన్ని సినిమాలలో కూడా నటించారు. అంతేకాకుండా తెలుగు సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. అర్చన తన గ్రాడ్యుయేషన్ తరువాత బ్యూటిషన్ కోర్స్ ను పూర్తి చేసారు. అర్చన కు పెద్దగా నటనపై ఆసక్తి లేకపోయినా, ఒకసీరియల్ ఆడిషన్ జరుగుతుంటే వెళ్లారు. ఆమె అక్కడ సెలెక్ట్ అవ్వడంతో బుల్లితెర ప్రవేశం చేసింది. మొదటగా ఒక డెడ్ బాడీ ప్రాతలో నటించింది. ఆ తరువాత మలయాళం సీరియల్స్ లో నటించి తనకంటూ ఒకగుర్తింపును తెచ్చుకుంది.
అర్చన కన్నడ తోపాటు తమిళ్ సీరియల్స్ కూడా నటించింది. ఒకరోజు తమిళ్ సీరియల్స్ ఆడిషన్స్ కు వెళ్లగా,అక్కడ ఆమెను చూసిన తెలుగు సీరియల్ యూనిట్ ఆమెను బుల్లితెరకు పరిచయం చేసింది. అలా తెలుగు ప్రజలకి సుపరిచితురాలు అయ్యింది అర్చన.
అర్చన నటిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు స్టార్ మా కు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
బిగ్ బాస్ లాంటి పెద్ద షో లను సైతం ఓడించేస్తోంది. అర్చన కార్తీకదీపం సీరియల్ తో పాటు కేరాఫ్ అనసూయలో కూడా నటిస్తోంది. అర్చన కన్నడలో సినీరంగం కూడా చేసారు. త్వరలోనే తెలుగు లో కూడా అవకాశం వస్తే పోలీస్ ఆఫీసర్ గా నటించాలని ఉందని మీడియా వేదికగా ఆమె వివరించారు. అయితే త్వరలోనే సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి,నా కోరికను తీర్చుకుంటానంటోంది అర్చన అనంత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి