ప్రస్తుత బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాల హవా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరికొత్త ఎంటర్టైన్మెంట్ కోసం బుల్లితెర షోలను  ఎక్కువగా వీక్షిస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలు తెరమీదికి వస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అయితే ఎన్ని కార్యక్రమాలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ అనే కార్యక్రమానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.  మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ఇక ప్రతి ఏడాది కూడా అంతకంతకు క్రేజ్ సంపాదించుకుని  బుల్లితెర చరిత్రలోనే  టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే.



 16 మంది కంటెస్టెంట్స్ తో మొదలయ్యే ఈ షో.. ఇక ఆ తర్వాత ఎలివేషన్లు, నామినేషన్లు, కాంట్రవర్సీలు, లవ్ స్టోరీ లు, ఎన్నో అదిరిపోయే టాస్క్ లతో ఇక ఎప్పటికప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు బుల్లితెర పై వచ్చిన బిగ్ బాస్ నాలుగు సీజన్ లు  కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇటీవలే ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్  సీజన్ 4 బుల్లితెర ప్రేక్షకులను  అందరూ ఇప్పటికీ నెమరువేసుకుంటూ ఉన్నారు.  ఇక బిగ్ బాస్ ఫోర్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వారు ఏదో ఒక షోలో గెస్ట్ లుగా ఎంట్రీ  ఇస్తూనే ఉన్నారూ అన్న విషయం తెలిసిందే.




 కాగా ఇటీవలే మా టీవీ లో ఒక సరికొత్త షో  ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్  సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అందరూ కూడా గెస్ట్ లుగా  ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఈ సరికొత్త కార్యక్రమానికి బిగ్ బాస్ ఉత్సవం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. శ్రీముఖి షో కి యాంకర్ గా రాగా.. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా.. గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  బిగ్ బాస్  హౌస్ తర్వాత మరోసారి కంటెస్టెంట్స్ అందరిని ఒక చోట చూడటంతో అటు  బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎంతో మురిసి పోయారు. ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: