మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ, షాషా ఛత్రి, జయరాం, ప్రియదర్శి, తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ప్రభాస్ ఈ మూవీ లో ఒక లవర్ బాయ్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనితో పాటు మరోవైపు కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాల్లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఇటీవల సలార్ షూటింగ్ ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభమయింది.
భారీ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెకుతున్న ఈ సినిమాని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నెవర్ బెఫోర్ నెవర్ ఎగైన్ అనే రీతిలో ఉంటుందని, ఇక ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్ ఇదేనని అంటూ ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో ప్రచారం అవుతోంది. దాని ప్రకారం మోస్ట్ వయోలెంట్ గా కనిపించే ప్రభాస్ పాత్ర ప్రకారం, సలార్ మాట ఎంత సైలెంట్ గా ఉంటుందో, దెబ్బ అంత వయోలెంట్ గా ఉంటుందట, అలానే గతంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు పగ తీర్చుకునే రివెంజ్ డ్రామాగా ఈ మూవీ తెరకెకుతోందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం రెబల్ స్టార్ ఫాన్స్ కి ఇది సూపర్ న్యూస్ అని అంటున్నారు విశ్లేషకులు .....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి