సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎంతోమంది హీరో హీరోయిన్లు కలిసి నటించడం జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  అయితే ఎంత మంది హీరో హీరోయిన్లు కలిసి నటించినప్పటికీ ప్రేక్షకులు మాత్రం కొంత మంది కే  బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు. ఇక ఆ జోడి ఎన్నిసార్లు వెండితెరపై మెరిసినప్పటికీ కూడా ఆ జోడిని చూసి మురిసిపోతూ ఉంటారు ప్రేక్షకులు. వెండితెరపై ఎన్నిసార్లు వచ్చిన ఆ జోడి సూపర్ హిట్ గానే పేరు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్ద కాలం నుంచి సూపర్ హిట్ జోడీగా పేరుతెచ్చుకున్న జంట ఏది అంటే నాగార్జున అనుష్క జంటగా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఎన్నో ఏళ్ల క్రితం సూపర్ సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఇప్పటికి కూడా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అనే విషయం తెలిసిందే.  ఇక ఇద్దరూ కలిసి నటించారు అంటే చాలు అటు సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఈలలు గోలలతో ఉర్రూతలూగి పోతూ  ఉంటారు. అంతలా  తెలుగు ప్రేక్షకులు అందరిని ఆకర్షించింది ఈ జంట. ఇక వీరిద్దరి జంట చూడటానికి కూడా చూడముచ్చటగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు నాగార్జున అనుష్క జంటగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తొమ్మిది సార్లు కలిసి నటించారు.



 అయితే కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్లు గా నటిస్తే మరికొన్ని సినిమాల్లో మాత్రం నాగార్జున హీరోగా నటిస్తే అనుష్క గెస్ట్ రోల్లో నటించింది. ఇక ఇప్పుడు పదవ సారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించేందుకు సిద్ధమైంది ఈ క్రేజీ జంట. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో నాగార్జున సరసన అనుష్క నటించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.  ఇకపోతే ప్రస్తుతం నాగార్జున అనుష్క 10 ఒకసారి కలిసి నటించబోతున్నట్లు టాక్  వినిపిస్తున్న నేపథ్యంలో అటు అభిమానులు అందరూ కూడా మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: