ఇక ఫుల్ రన్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.52 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.28 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.52 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా ఎన్నో మైలురాళ్లను చేరుతూ ఊహించని రీతిలో రికార్డులను బద్దలు కొట్టేసింది.
తెలుగులో ఎక్కువ లాభాలను అందుకున్న మీడియం చిత్రాల జాబితాలో రూ. 27.02 కోట్లతో 'జాతి రత్నాలు' నాలుగో స్థానంలో నిలిచింది. అయితే దీని కంటే ముందు 'గీత గోవిందం' రూ. 55.43 కోట్లతో మొదటి స్థానంలో, 'ఉప్పెన' రూ. 31.02 కోట్లతో రెండో స్థానంలో, 'ఫిదా' రూ. 30.50 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' రూ. 22.78 కోట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.ఇక రామ్ రికార్డుని అవలీలగా కొట్టిన నవీన్ విజయ్ రికార్డుకి చాలా దూరంలో వుండిపోయాడు. ఇక భవిష్యత్తులోనైనా విజయ్ రికార్డుని కొడతాడో లేడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి