తెలుగులో లవర్ బాయ్ గా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దార్థ్. "నువ్వోస్తానంటే నేనోద్దంటానా ", బొమ్మరిల్లు " వంటి సినిమాలతో యూత్ లోనూ, అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఈయన తెలుగులో చివరి చిత్రం " జబర్ధస్త్ " సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన తరువాత స్ట్రయిట్ తెలుగు సినిమాలకు దూరమై తమిళ్ సినిమాలకు ఫిక్స్ అయ్యాడు. అయితే తమిళ్ సినిమాలలో లవర్ బాయ్ గా ఇమేజ్ ను పక్కన పెట్టి వరుసగా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు.

ఇక సిద్దార్థ్ అప్పుడప్పుడు రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటాడు. ఇక ఇటీవల దేశ కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంబిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ వచ్చాడు సిద్దార్థ్. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్పు సిద్దార్ధ్ - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.. అయినప్పటికీ వెనక్కి తగ్గని సిద్దార్థ్ తాజాగా బీజేపీ ఎంపీ ని తీవ్రవాది అజ్మల్ కసబ్ తో పోల్చుతూ చేసిన ట్వీట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 

దాంతో బీజేపీ నేతలనుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సిద్దార్థ్ పోలీసులను కూడా ఆశ్రయించాడు. ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విష్ణు వర్ధన్ రెడ్డి మరోసారి సిద్దార్థ్ పై విమర్శలు గుప్పించారు. " సిద్దార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రాహీం ఫౌండర్ గా ఉన్నాడు " అంటూ విష్ణు ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా సిద్దార్థ్ " లేదు రా.. దావూద్ నా సినిమాలకు ఫౌండర్ గా లేడు.. నేను పర్ఫెక్ట్ సిటిజన్ మరియు టాక్స్ పేయర్.. అలా అనడానికి సిగ్గుండాలి " అంటూ సిద్దార్థ్ ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: