ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తో పూర్తి స్థాయి హీరో అయిపోయాడు.. అదే పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ఇడియట్ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు రవితేజ.. ఆ తరువాత వెనుతిరిగి చూడలేదు.. రవితేజ విజయాన్ని చూసి తన కష్టానికి తగిన ఫలితం దొరికిందని అనుకున్నారు అందరూ.. రవితేజ కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఆయన్ని రాటుదేలేలా చేశాయి.. హిట్ వచ్చినప్పుడు పొంగిపోలేదు.. ఫ్లాప్ వచ్చినప్పుడు కృంగిపోలేదు.. అలా రవితేజ నటించిన హిట్ సినిమా కిక్..
ఈ చిత్రం 2009, మే 8న విడుదలైంది. అంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం అన్నమాట. ఈ సినిమాతోనే తమన్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈయన మొదటి సినిమా కూడా ఇదే. తొలి సినిమాతోనే పాటలతోనే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పిచ్చెక్కించాడు థమన్. అప్పుడు మొదలైన వాయింపు ఇప్పటికీ ఆగడం లేదు. ఈ సినిమా పుష్కరం పూర్తి చేసుకున్న సందర్భంగా రవితేజ ఫ్యాన్స్ సోష ల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ‘#12YearsForKick’ ‘#12YearsOfKICKMadness’ హ్యాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం అదిరిపోయే కామెడీ.. అద్భుతమైన సెంటిమెంట్.. దానికితోడు పిచ్చితో కిక్ పిచ్చెక్కించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి