దాదాపుగా పది మంది దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన నైపుణ్యాన్ని పొందిన వీరభద్ర చౌదరి అహ నా పెళ్ళంట సినిమా తో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పూలరంగడు సినిమా కు దర్శకత్వం వహించారు వీరభద్ర. సునీల్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నవ్వుల పంట పూయించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత చుట్టాలబ్బాయి, భాయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మీసాలు కూడా రాని చిన్న వయసులో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను ఇక్కడే అన్నీ నేర్చుకుంటూ పెరిగాను అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీ నాకు ఎన్నో విషయాలను మరియు మెలకువలను నేర్పింది. మొదట ఈవీవీ సత్యనారాయణ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈవీవీ అంటేనే డిసిప్లేన్, పంక్చువాలిటీ ఓ ప్రణాళిక ప్రకారం తన పని తాను ఖచ్చితంగా చేసుకుపోతారు. అలాగే చేయిస్తారు కూడా, ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు పక్కా టైమింగ్ ప్రకారం పూర్తి చేయడం ఆయన నైజం. అంత డిసిప్లేన్, డెడికేషన్ ఉన్న డైరెక్టర్ ని నేను ఇంతవరకు చూడలేదు  అంటూ ఈవివిని ప్రశంసలతో ముంచెత్తారు దర్శకుడు వీరభద్ర చౌదరి. అలాంటిది ఆయన తనయుడు అల్లరి నరేష్ తో నా మొదటి సినిమా ప్రారంభం అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు, యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది.

ఎక్కువ సమయం వారి ఇంటి దగ్గర గడుపుతుండటం వలన ఖాళీ దొరికినప్పుడల్లా నేను నరేష్, రాజేష్ గారు కలసి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. నరేష్ తో చాలా చనువుగా ఉండేవాడిని అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక కింగ్ నాగ్ తో సినిమా చేసేటప్పుడు చాలా అంచనాలు ఉండేవి, ఒక వేళ అది కనుక సక్సెస్ అయి ఉంటే నాకు ఇంకో లాగా ఉండేది. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటారు. అందరితోనూ చాలా సరదాగా ఉంటారు అని అన్నారు. ఇక వరుస సినిమాలు చేసే విషయానికొస్తే, చేస్తే మంచి కథతో  మంచి హీరోని పెట్టి తీయాలి, లేదంటే ఖాళీగా ఉండాలి. అప్పుడు వెంటనే వ్యాఖ్యాత రావు గోపాల్ వర్మ గురించి టాపిక్ తీసుకురాగా, ఇప్పుడు ఆ జీవి కాంట్రవర్సీలు మధ్యలో  ఎందుకండి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ వీరభద్ర చౌదరి ఆది సాయికుమార్ హీరోగా  ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలతో మొదటి స్టెప్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: