అయితే 1961లో ‘సీతారామ కళ్యాణం’ సినిమాతో దర్శకునిగా అవతరించిన తారక రామారావు గారు 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. రామారావు గారు దర్శకునిగా తన తొలి సినిమాతోనే అద్భుత విజయాన్ని సాధించారు. ఆ తరువాత ‘గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం, వరకట్నం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. అదే తరహాలో ‘తల్లా? పెళ్లామా?, తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, చండశాసనుడు’ సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్నారు. అయితే 1984లో వచ్చిన ‘శ్రీమద్విరాట్ పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.
అయితే నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన రామారావు గారు దర్శకుడిగాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేక పోయాయి. వాటిలో ‘చాణక్య చంద్రగుప్త, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్విరాటపర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఈ విధంగా రామారావు గారి దర్శకత్వ ప్రస్థానంలో మొత్తం 16సినిమాలు చేయగా వాటిలో 5 బ్లాక్ బస్టర్లు, 3 సూపర్ హిట్లు, 5 పర్వాలేదు అనిపించుకోగా కేవలం రెండు సినిమాలు మాత్రమే నిరాశ పరిచాయి.
అయితే నందమూరి తారక రామారావుగారు దర్శకత్వం వహించిన సినిమాలు ఇవే:













క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి