ఇటీవల సంక్రాంతి సమయంలో గోపీచంద్ మలినేని తీసిన క్రాక్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ మహారాజ రవితేజ. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారికంగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. విడుదల తరువాత భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమా కెరీర్ పరంగా చాలారోజుల నుండి సతమతం అవుతున్న రవితేజ కు పెద్ద బ్రేక్ నిచ్చింది.

ఇక ఈ మూవీ తరువాత మాస్ రాజా చేస్తున్న తాజా సినిమా ఖిలాడీ. యువ దర్శకుడు రమేష్ వర్మ తీస్తున్న ఈ సినిమా యాక్షన్ తో కూడిన కమర్షియల్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాలో లో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పెన్ మూవీ, ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ కి అందరి నుండి బాగా రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే జూన్ 7వ తేదీన ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని యూనిట్ విడుదల చేయనుందట. దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుందని, త్వరలో దీనికి సంబంధించి అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందని చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే రవితేజ ఫ్యాన్స్ కి ఇది పండుగ న్యూస్ అనే చెప్పాలి ...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: