త‌మిళ హీరో సూర్య‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సౌత్ ఇండియాలో ఆయ‌న స్టార్ హీరోగా కొన‌సాగుతున్నారు. ఇక వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఆయ‌న‌. ఆయ‌న న‌ట విశ్వ‌రూపానికి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ప్ర‌తి సినిమాతో కొత్త ప్ర‌యోగాలుచేస్తుంటారు సూర్య‌. అలాంటి స్టార్ హీరో ఇప్పుడు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆయ‌న‌కు ప్ర‌త్యేకం అని చెప్పాలి.

ఎందుకంటే ఇది ఆయ‌న‌కు 40వ సినిమా. దీన్ని పాండిరాజ్ దర్శకత్వంలో తెర‌కెక్కిస్తున్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చాన్స్‌కొట్టేసింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు ప్రీ లుక్స్ పోస్ట‌ర్లు కూడా చాలా ఆకట్టుకున్నాయి. ఇందులో మొదటి పోస్టర్ లో మ‌న హీరో సూర్య తుపాకీ పట్టుకుని ప‌వ‌ర్‌ఫుల్‌గా కనిపిస్తే.. ఫ్యాన్స్ కుషీ అయ్యారు. ఇక రెండో పోస్టర్ లో కత్తి పట్టుకుని మాస్ అప్పీయరెన్స్ తో దుమ్ములేపాడు సూర్య‌.

ఇదిలా ఉండ‌గా నిన్న సోమవారం దర్శకుడు పాండిరాజ్ బ‌ర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ ను స్పీడ్ గా చేస్తున్నామ‌ని, ఇప్పటికి 35 శాతం వ‌ర‌కు పూర్తి చేశామ‌ని తెలిపారు. లాక్ డౌన్ త‌ర్వాత దీని షూటింగ్ తిరిగి స్టార్ట్ చేస్తామ‌న్నారు. జూలై నెలలో సినిమా టైటిల్ ప్రకటించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో సూర్యఅభిమానులు  ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ రావడంతో బాగా సంబురాలు చేసుకుంటున్నారు.

ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు. ఇందులో సత్యరాజ్ - జయప్రకాశ్ - శరణ్య లాంటి ప్ర‌ముఖ న‌టులు చేస్తున్నారు. డి.ఇమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీలో దీన్ని తీస్తున్నారు. పాండిరాజ్ గతంలో సూర్య తో ‘పసంగ 2 మూవీని చేయ‌గా.. అది బాగా ఆడింది. ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని న‌మోదుచేస్తాడో చూడాలి. ఇక ఈ మూవీ కోసం అభిమానులు బాగానే వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: