నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం “అఖండ”. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయో అందరికి తెలిసిందే.ఇప్పుడు అఖండ హ్యాట్రిక్ చిత్రం అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ పూర్ణ కనిపించనుంది. అయితే ఈ చిత్రం వస్తున్న ప్రతి అప్డేట్ కి అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది . అయితే మొన్న మే 28న సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అని రూమర్ వచ్చింది కానీ అది జరగలేదు. దీనితో బాలకృష్ణ అభిమానులు కొంచెం నిరాశకు గురయ్యారు. ఇది ఇలా ఉంటే వచ్చే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ రాబోతుంది అని మూవీ టీం ఆఫీషల్ గా ప్రకటించారు. అదేంటి అంటే ఈ సినిమా నుంచి ఒక మాస్ పోస్టర్ ని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు అంట. ఈ విషయం తెలిసిన అభిమానులు కొంచెం ఆనందంగా మరియు కొంచెం బాధగా ఉన్నారు.

ఎందుకంటే ఆ రోజు ఈ సినిమా నుంచి అందరూ టీజర్ వస్తుంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు జస్ట్ పోస్టర్ అని అనడంతో కొంచెం నిరాశలో ఉన్నారు. ఇక ఈ సినిమా మీద అంచనాలని ఈ పోస్టర్ ఇంకా ఎంత పెంచుతుందో వేచి చూడాలి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. చిన్న టీజర్ లోనే బాలయ్య విశ్వరూపం చూపించారు బోయపాటి ఇంకా సినిమాలో ఆయన ఎలా ఉంటారో విడుదల వరకు వేచి చూడాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: