గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘శాకుంతలం’ మూవీ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. మహాకవి కాళిదాసు రచించిన ‘శాకుంతలం’ కావ్యాన్ని ఒక దృశ్య రూపంగా మార్చాలని గుణశేఖర్ చాల పట్టుదలగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

శకుంతల గా సమంత దుష్యంతుడు దేవ్ మోహన్ నటిస్తున్న ఈమూవీలో మరొక కీలక పాత్రలో బాలనటుడు నటించ వలసి ఉంది. అదే భరతుడి పాత్ర శకుంతల దుష్యంతలకు పుట్టిన భరతుడి పాత్ర ‘శాకుంతలం’ మూవీలో కీలకం కానున్నది. దీనితో ఈ కీలక పాత్రలో నటించగల బాలనుటుడు కోసం గుణశేఖర్ అప్పుడే అన్వేషణ మొదలు పెట్టినట్లు టాక్.
తెలుస్తున్న సమాచారం మేరకు భరతుడి పాత్ర కోసం గుణశేఖర్ ఆలోచనలలో రెండు పేర్లు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. అందులో మొదటి పేరు జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ అని అంటున్నారు. జూనియర్ బాలనటుడుగా ఉన్నప్పుడు గుణశేఖర్ చిన్న పిల్లలతో తీసిన ‘రామాయణం’ లో తారక్ రాముడుగా నటించాడు. ఇప్పుడు అదే ఎన్టీఆర్ కొడుకును భరతుడు గా ‘శాకుంతలం’ చూపెడితే బాగుంటుంది కదా అన్న సలహాలు ఇప్పటికే గుణశేఖర్ కు వస్తున్నట్లు తెలుస్తోంది.
మరికొంతమంది గుణశేఖర్ సన్నిహితులు ఈ భరతుడి పాత్ర కోసం అల్లు అర్జున్ కొడుకు అయాన్ పేరును సూచిస్తున్నట్లు టాక్. గుణశేఖర్ తీసిన ‘రుద్రమదేవి’ మూవీలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన బన్నీ పై గుణశేఖర్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. దీనితో ఈ స్టార్ కిడ్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు ‘శాకుంతలం’ లో భరతుడు గా కనిపించడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇండస్ట్రీలో గత రెండు రోజులుగా హడావిడి చేస్తున్న ఈ వార్తలను కొంతమంది తేలికగా తీసుకుంటున్నారు. గుణశేఖర్ ‘శాకుంతలం’ భరతుడి పాత్ర కోసం ఎవరో ఒక స్టార్ కిడ్ ను ఎంపిక చేసి మిగతా హీరోలతో తన దూరాన్ని పెంచుకోడాని ఈ భరతుడి పాత్రకు కూడ మళయాళ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన చైల్డ్ ఆర్టిస్ట్ రంగంలోకి దిగుతాడు అని అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి