తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి గొప్ప స్థానం ఉంది.. స్వయం కృషితో పైకొచ్చిన చిరంజీవి ఎందరో నటులకు ఆదర్శంగా నిలిచారు. నటన అనేది వయస్సు కు సంబంధించినది కాదు.. మనసుకు సంబంధించినది అని చిరు ఎప్పుడూ చెప్పేవాడు. అందుకే ఈ వయస్సు లో కూడా వరుస సినిమా లలో నటిస్తూ బిజిగా ఉన్నాడు. ఇది ఆయన పట్టుదలకు నిదర్శనం.. కేవలం సినిమా లకే కాదు, పర్సనల్ గా కూడా చాలా మంచి వ్యక్తి.

ఇటీవల భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మరి కారణంగా రోడ్డున పడిన సినీ కార్మికులను ఆదుకోవటానికి చారిటీ ని ప్రారంభించి ఆర్దికంగా అండగా నిలబడ్డారు.. ఈ దెబ్బతో మరోసారి రియల్ హీరో అయ్యాడు.. ఇప్పుడు మరోసారి జనాల మనసును గెలుచుకున్నాడు. వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్‌ డేని పురస్కరించుకుని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు రక్తదానం చేశారు. సతీ సమేతంగా బ్లడ్‌ డొనేట్‌ చేస్తున్న పిక్‌ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసిన చిరు.. తన బ్లడ్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ అందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు.


వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్‌ డేని పురస్కరించుకుని రక్తదాతలందరినీ ,మరీ ముఖ్యంగా బ్లడ్‌ డొనేట్‌ చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన నా బ్లడ్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ని అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యాక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం.. మానవత్వం ఉంటే మనిషి చరిత్రలో నిలుస్తాడని చిరు అన్నారు. ఇకపోతే ఇప్పుడు అందరికి అవసరమైన ఆక్సిజన్ కోసం కోట్లలో ఖర్చుపెట్టి 'చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌'ను స్థాపించి.. మహత్తర కార్యక్రమానికి మెగాస్టార్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌ అందక ఇంకెవరూ చనిపోకూడదని.. రామ్‌ చరణ్‌ ఆధ్వర్యం లో రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరు ఈ బ్యాంకులను నెలకొల్పుతున్నారు..  మెగా అభిమానుల సమక్షంలో  ఈ బ్యాంక్‌లు ఎన్నో సేవలను అందిస్తున్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి: