2002 జనవరి 14 వ తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్టయిన "నువ్వు లేక నేను లేను" చిత్రానికి వై. కాశీ విశ్వనాధ్ కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం-డైలాగులు అందించారు. ఈ సినిమాలో కృష్ణవేణి గా ఆర్తి అగర్వాల్.. రాధాకృష్ణ గా తరుణ్ నటించారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ప్రేమ హృదయాలను హత్తుకుంటుంది. ఇద్దరు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుతూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతుంటారు. ఈర్ష్య, అసూయ, అలక ఇలా అన్ని కలబోతగా "నువ్వు లేక నేను లేను" సినిమాని రూపొందించారని చెప్పవచ్చు. అయితే తరుణ్, ఆర్తి అగర్వాల్ జంట చాలా చూడముచ్చటగా అనిపించింది. క్యూట్ గా లవ్లీగా ఉండే ఆర్తి అగర్వాల్ ఈ సినిమాలో తరుణ్ పై చిటపటలాడుతూ భలే అందంగా కనిపించారు.


ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ సినిమాలో కృష్ణవేణి, రాధాకృష్ణ కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తూ ఉంటాయి. వారిద్దరి తల్లిదండ్రులు కలిసి వ్యాపారం చేస్తుంటారు. చిన్నతనం నుంచి కృష్ణవేణి, రాధాకృష్ణ కలిసి పెరుగుతుంటారు. ఇక ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ క్రమంలోనే వ్యాపారంలో ఒడిదుడుకులు రావటంతో ఈ రెండు కుటుంబాలను సమస్యలు చుట్టుముడతాయి. అప్పుడు ఓ పెద్ద మనిషి వచ్చి ఈ కుటుంబాలకు సహాయం చేస్తాడు. బదులుగా కృష్ణవేణి ని తన మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరడంతో రెండు కుటుంబాలు అంగీకరిస్తాయి. అయితే కృష్ణవేణి రాధాకృష్ణను బాగా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదనలేక ఆమె తెగ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే చివరికి వీరిద్దరి ప్రేమ గురించి తెలుసుకుని పెద్దలే దగ్గరుండి పెళ్లి చేస్తారు.



ఈ సినిమాలోని ప్రథమార్థం చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ గురించి ఉంటుంది. కొన్ని హృద్యమైన సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. అయితే ఈ రొమాంటిక్ సన్నివేశాలకు ఆర్. పి. పట్నాయక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆర్.పి పట్నాయక్ స్వరపరిచిన పాటలు కూడా "నువ్వు లేక నేను లేను" ప్రేమ కథను వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: