సినిమా పరిశ్రమలో
హీరోయిన్ సౌందర్య కు ఉన్న గుర్తింపు వేరే. నటిగా ఎన్నో సినిమాలలో నటించి స్టార్
హీరోయిన్ గా ఎదిగింది. ఒక్కొక్కరితో రెండు మూడు సినిమాల్లో నటించి గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతలు అందుకుంది. హీరోలందరి అభిమాన నటిగా ఈమె మంచి పేరు తెచ్చుకో గా
సినిమా కెరీర్ పిక్స్ లో ఉండగానే ఈమె చనిపోయి ఎంతో మందికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక నందమూరి
బాలకృష్ణ కలల ప్రాజెక్ట్
నర్తనశాల సినిమాలో
సౌందర్య నటించిన విషయం అందరికీ తెలిసిందే.
రామోజీ ఫిలిం సిటీ లో పర్ణశాల సెట్ వేసి ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశాక అర్థంతరంగా షూటింగ్ అయిపోయింది.
బాలకృష్ణ డైరెక్టర్ గా అవతారమెత్తి చేస్తున్న ఈ
సినిమా ఇలా అయిపోవడంతో నందమూరి
బాలకృష్ణ అభిమానులు ఎంతగానో కలత చెందారు. అయితే ఈ
సినిమా ఇలా ఆగిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే.
సౌందర్య అకాల మృతి తో
నర్తనశాల సినిమా ఆగిపోయింది. ఈ సినిమాలో ద్రౌపది పాత్ర లో నటిస్తున్న
సౌందర్య 2004వ సంవత్సరంలో విమాన ప్రమాదంలో మరణించగా
బాలకృష్ణ ఈ ప్రాజెక్టుని ఆపేశారు.
బాలకృష్ణ అప్పటికి తీసింది కొన్ని సీన్లు అయినా
సౌందర్య స్థానంలో మరొకరిని తీసుకొని ఆ సినిమాను పూర్తి చేయవచ్చు కానీ ద్రౌపదిగా
సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేను అని చెప్పేశాడట. అంతకుముందు ఆ ఇద్దరు కలిసి టాప్
హీరో వంటి సూపర్ హిట్ సినిమాను చేశారు. బాలకృష్ణను ఏకవచనంతో పిలిచేంత స్నేహం వీరిద్దరి మధ్య ఏర్పడింది. ఆయనను
సౌందర్య బాల అని పిలిచేవారు ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే చెప్పారు.
నర్తనశాల చిత్రంలో ద్రౌపది పాత్ర చేయమని అడిగినప్పుడు నా మీద ఉన్న నమ్మకంతో నా దర్శకత్వంలో నటించాలనే అభిప్రాయంతో ఆ పాత్ర మీద ఉన్న ఇష్టంతో సహృదయంతో వెంటనే అంగీకరించింది. రేపు ప్రారంభోత్సవం అనగా ముందు రోజు గెటప్ వేసుకొని వచ్చి మరి ఆయనకు చూపించారట సౌందర్య. షూటింగ్ లో సింగిల్ టేక్ లో ప్రతి డైలాగును ఓకే అయ్యేలా చేసింది. గొప్ప వ్యక్తి మరణం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న
సౌందర్య నీ ఎప్పటికీ మరువలేమని
బాలయ్య ఎమోషనల్ అయ్యారు.