మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో ఒక్కొక్కరిది ఒక్కో డిఫరెంట్ స్టైల్ అని చెప్పవచ్చు. అయితే అందరు దర్శకుల మాట ఎలా ఉన్నాగాని మన వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ‌ డైరెక్షన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఆర్జీవీ ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరు ఊహించలేరు.తీసిన ప్రతి సినిమా కూడా ముందుగా వివాదాస్పదం అయిన తరువాత గాని రిలీజ్ అవ్వదు.ఎప్పుడు, ఎవరి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని సినిమా తెరకెక్కిస్తాడో ఆయనకే తెలియదు. అయితే గతంలో ఆయన తెరక్కేకించిన ఏరోటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఐస్‌ క్రీమ్ సినిమా మీకు గుర్తు ఉండే ఉంటుంది.

ఆ తర్వాత అ సినిమాకు సీక్వెల్ గా ఐస్‌క్రీమ్-2 సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్స్ మొద‌టి పార్టులో న‌వ‌దీప్‌, తేజ‌స్వి ముఖ్య పాత్రల్లో న‌టించగా, సెకండ్ పార్టులో మాత్రం మృదులా,భాస్క‌ర్ ముఖ్య పాత్రలలో న‌టించారు.అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మరొక సెన్సేషనల్  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐస్ క్రీమ్ సినిమాకు గాను థర్డ్ సీక్వెల్ చేయాలనీ అనుకుంటున్నారట. మరి కొన్ని రోజుల్లోనే మూడో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకు కూడా తొలి రెండు పార్టులను నిర్మించిన తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణే  మూడో పార్టుకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పార్ట్ లో నటించే నటి నటుల గురించి సమాచారం ఇంకా తెలియలేదు. అయితే ఈ ఐస్ క్రీమ్ మూవీ థర్డ్ సీక్వెల్ ను అత్యంత భారీగా ప్లాన్ చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ చూస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు.ఈ సినిమాకు సంబందించి మరికొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి అని తెలుస్తుంది.మరి ఈ  సినిమా ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: