టాలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపును, అందాల కథానాయిక అనే మంచి క్రేజ్ ను దక్కించుకుంది హీరోయిన్ శిల్పా శెట్టి. తెలుగులో ఆమె సాహస వీరుడు సాగర కన్య సినిమా తో పరిచయం కాగా మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. అంతకుముందు హిందీలో బాజి గర్ సినిమాతో అరంగేట్రం చేసి అక్కడ కూడా ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన తర్వాత రాఘవేంద్రరావు తెరకెక్కించిన సాహస వీరుడు సాగర కన్య సినిమా లో ఈ బాలీవుడ్ హీరోయిన్ ను ఎంచుకున్నారు.
తెలుగులో వెంకటేష్ పరిచయం చేయించిన ఎంతోమంది హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. ఆ తర్వాత ఆమె వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు వంటి చిత్రాలు చేసింది. ఈ సినిమాలు అన్ని ఫ్లాప్ కావడంతో ఆమె ఎక్కువగా తెలుగు సినిమాలు చేయలేదు. హిందీలోనే సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఐటం సాంగులు కూడా చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఇక ఆమె పర్సనల్ జీవితం విషయానికి వస్తే శిల్పా శెట్టి రాజ్ కుంద్రా అనే ప్రముఖ వ్యాపారవేత్త బాలీవుడ్ ఫైనాన్సర్ ను పెళ్లి చేసుకుంది.
ఆయన ఇటీవలే పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన విషయం అందరికీ తెలిసిందే . వెబ్ సిరీస్ లో అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి వాళ్లతో పోర్న్ చిత్రాలు చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేయగా ఇప్పుడు ముంబైలో ఇది ఎంతో ఆసక్తికరమైన కేసు గా మారింది. పోర్న్, సెమీ పోన్ సినిమా లు తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడు అంటూ అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మొత్తం పోర్న్ మాఫియా కి ఆయనే సూత్రధారి అని తేల్చేశారు. అన్ని ఆధారాలు సిద్ధమయ్యాకే రాజ్ కుంద్రాను అరెస్టు చేసినట్లు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి