తెలుగు చిత్ర పరిశ్రమలో హన్సికకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ అమ్మడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.  ఒకప్పుడు బొద్దుగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్కసారిగా సన్నబడటం తో ఈ అమ్మడికి క్రేజ్ తగ్గిపోయింది. అయితే పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సరైన విజయాలు మాత్రం అందుకోలేకపోతుంది హన్సిక. అయితే ఇటీవలి కాలంలో అటు స్టార్ హీరోయిన్లతో పాటు చిన్న హీరోయిన్లు కూడా సరికొత్త ప్రయోగాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.


 ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఆ తర్వాత అవకాశాలు లేక వెండితెరపై కనుమరుగైన హీరోయిన్లు వినూత్నమైన ప్రయోగాలతో తెర మీదికి వచ్చి మళ్లీ చిత్ర పరిశ్రమలో సక్సెస్ సాధించాలి అని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలా సరికొత్త కథాంశంతో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొంతమంది హీరోయిన్లు ఈ వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అయ్యారు. మరికొంతమంది మాత్రం డీలా పడిపోయారు. ఇప్పుడు హన్సిక కూడా ఒక వినూత్నమైన ప్రయోగానికి సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.



 తెలుగులో 105 మినిట్స్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఒక ప్రయోగాత్మక సినిమాలో హన్సిక నటిస్తూ ఉండడం గమనార్హం. ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా కేవలం సింగిల్ షాట్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట . ఒక ఇంట్లో వివిధ సమయాల్లో జరిగే సన్నివేశాలను ఆధారంగా చేసుకుని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది   అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన నిడివి కూడా నూట అయిదు నిమిషాలు ఉండబోతుందట. ఇక ఈ సినిమాకి రాజా దుస్సా  దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ప్రయోగాత్మకమైన సినిమా హన్సిక కెరీర్ లో ఏమైనా మారుస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: