సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావాలంటే అందం అభినయంతో పాటు, నటన పరంగా ఎంతో గుర్తింపు పొందాలి. అలా తను నటించిన మొదటి సినిమాతోనే బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మీనన్.. అయితే ఈమె సినీ ఇండస్ట్రీలోకి  అప్పుడు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
నాని, నిత్యా మీనన్, నందిని రెడ్డి డైరెక్షన్లో "అలా మొదలైంది" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. ఇక తన మొదటి సినిమాతోనే హీరోయిన్ గా నటించి, అలాగే సింగర్ గా కూడా బాగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

సినీ ఇండస్ట్రీలో నిత్య మీనన్ అంత ఈజీగా ఏ పాత్రకైనా ఓకే చెప్పదు, తనకి నచ్చితేనే  ఒప్పుకుంటుందని సినీ ఇండస్ట్రీలో బాగా టాక్ కూడా తెచ్చుకుంది.ఈమె కథ పరంగా పాత్ర నచ్చకపోయినా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తానన్న కూడా చేయట. అందుచేతనే ఈమె నుండి ఎన్నో సినిమాలు దూరం అయ్యాయి.. సినీ ఇండస్ట్రీలో వినికిడి. ఇక అంతే కాకుండా ఈమె హీరోయిన్ కాకముందే చైల్డ్ నటిగా ఒక సినిమాలో చేసింది.

అలా సినిమాల్లోకి ఆమెకు అవకాశం ఎలా వచ్చింది అంటే.. తన స్కూల్ కి వెళ్ళే రోజుల్లో, తమ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఆమె ఫోటోను చూసి, ఆమెను తను ఆడిషన్స్ కి   రమ్మని చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్ళింది. అలా "ఫ్రెంచ్ ఆక్సెంట్ " సినిమాలో నటించమని తెలిపారు.
అప్పుడు నిత్యామీనన్ వయసు ఎనిమిది సంవత్సరాలు. ఈమె ఆ డైలాగులను బట్టి పట్టి వారికి చెప్పిందట.

ఆమె అలా చెప్పడం తో డైరెక్టర్ తో సహా అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. దీంతో ఈమెను ఈ సినిమాలో ఫైనల్ చేశారట. ఏమంటే ఇది ఇంగ్లీష్ మూవీ.. ఇందులో మరొక నటి ఎవరంటే టబు నటించడం విశేషం. ఇక తను అలా మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: