ఈ సినిమాలో రేచీకటి ఉన్న రోల్ లో వెంకీ... నత్తి ఉన్న వ్యక్తి రోల్ లో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించగా, ఈ సినిమా గురించి ఇప్పుడు మరో లేటెస్ట్ న్యూస్ సంచలనంగా మారింది. ఈ చిత్రంలో బల్లాల దేవుడు రానా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. గతంలో... వెంకీ సినిమాలో కనిపించే చాన్స్ కోసం వెయిటింగ్ అంటూ రానా అన్నట్లు వార్తలు ప్రచారం కాగా, ఇప్పుడు అది నిజమయ్యే సమయం వచ్చింది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు గంట నిడివి పాటు రానా పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ మెహరీన్ కు బావగా రానా నటించినున్నట్లు చెబుతున్నారు. రానా రాకతో సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని..... సినిమాలో రానా ఫన్ మామూలుగా ఉండదని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి