పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దగ్గుబాటి రానా తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి గా చేస్తున్న ఈ సినిమాలో రానా కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం అనే మూవీకి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తుండగా దీని కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొద్దిపాటి మార్పు చేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకి రవి కె చంద్రన్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ మూవీ ని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి మిశ్రమ స్పందన లభించింది. పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకుని మాస్ డైలాగ్స్ పలికిన ఆ టీజర్ ఆయన ఫ్యాన్స్ కి బాగానే మెప్పించినప్పటికీ సాధారణ ప్రేక్షకులని మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో కథ ప్రకారం అటు పవన్, ఇటు రానా ఇద్దరి పాత్రలు కూడా సమానంగా సాగేవే అని, అలానే ఈ మూవీలో పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ కాగా రానా క్యారెక్టర్ పేరు డ్యానియేల్ శేఖర్ అని సమాచారం.
కాగా ఈ సినిమా టైటిల్ ని భీమ్లా నాయక్ అని పెట్టడం ఎంతవరకు సమంజసం అని, అటు మలయాళంలో ఒరిజినల్ వర్షన్ టైటిల్ ని ఇద్దరు నటుల పేర్లు కలిసివచ్చేలా పెట్టినపుడు ఇక్కడ కేవలం పవన్ పాత్రకి మాత్రమే ప్రాధాన్యత్యనిస్తూ భీమ్లా నాయక్ అని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కొందరు ఆడియన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరేమో భీమ్లా నాయక్ అనేది మూవీ అఫీషియల్ టైటిల్ కాదని, త్వరలో రానా క్యారెక్టర్ టీజర్ కూడా రిలీజ్ చేసిన తరువాత మూవీ అసలు టైటిల్ ప్రకటన చేస్తారని అంటున్నారు. మరి ఇంతకీ ఈ మూవీని భీమ్లా నాయక్ పేరుతో ఒక్క పవన్ పేరు కలిసి వచ్చేలా ఓన్లీ నాయక్ చేస్తారో లేదో తెలియాలి అంటే మరికొద్దిరోజుల వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు ....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి