అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా టాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్స్‌లో నటించింది. నేచురల్ స్టార్ నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తమిళ్, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇటీవల హర్యానా మాజీ సీఎం మనవడితో ఈ భామకు పెళ్లి  కుదిరింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయినట్లు మెహ్రీన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ తర్వాత మెహ్రీన్ సినిమాలపైనే ఫుల్ కాన్సంట్రేట్ చేసినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.



తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత మెహ్రీన్ పాప పది కిలోల వెయిట్ లాస్ అయినట్లు కనిపిస్తున్నదని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రజెంట్ ‘హనీ’గా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఎఫ్ 3’లో నటిస్తున్న మెహ్రీన్.. ఈ చిత్రంతో పాటు మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో మెహ్రీన్ నటించిన చిత్రాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి.



తెలుగు ప్రేక్షకులకు ఈ భామ నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వత్థామ’ చిత్రంలో కనిపించింది. ఈ సంగతులు పక్కనబెడితే.. మెహ్రీన్ శాండల్‌వుడ్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరసన హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం అఫీషియల్ అయితే ఈ భామ ఇక స్టార్ హీరోయిన్ అయిపోయిందనే చెప్పొచ్చు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చిత్రాల్లో ఇప్పటికే ఫుల్ బిజీ అయిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇక కన్నడ సినిమాల్లోనూ తన సత్తా చాటబోతున్నదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: